బీసి సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్….

బీసి సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్….

కుప్పగల్ విడిది కేంద్రం వద్ద బీసి సామాజిక వర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.

జగన్ ప్రభుత్వం బీసీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది.

వాల్మీకి, బోయ లకు అంటూ కుల వృత్తి అంటూ ఏమీ లేక సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు.

వైసిపి పాలనలో గొర్రెల కాపరులకు ఎటువంటి సహాయం అందడం లేదు.

దూదేకుల ముస్లీం లకు వైసిపి ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించడం లేదు.

వైసిపి ప్రభుత్వం రజక సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేసింది. మాకు ఎటువంటి సహాయం అందడం లేదు.

లోకేష్ మాట్లాడుతూ

ప్రజలు ఎప్పటికీ పేదరికం లో ఉండాలి అనేది జగన్ ఆలోచన.

పేదరికం లేని రాష్ట్రం చూడాలి అనేది నా కోరిక.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు స్వర్ణయుగం తెస్తాం.

బీసీలకు పుట్టినిల్లు టిడిపి.

బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టిడిపి వలనే.

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది టిడిపి.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టిడిపి.

బీసీలని జగన్ నమ్మించి వెన్నుపోటు పొడిచారు.

బీసీలకి 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి 16,500 మంది బీసీలను పదవులకి దూరం చేసాడు జగన్.

ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించాం.

ఆదరణ పథకం 2 ద్వారా టిడిపి హయాంలో కొన్న పనిముట్లు బిసిలకు ఇవ్వకుండా వాటిని గోడౌన్స్ లో పడేసి తుప్పు పట్టేలా చేశారు.

బీసీ విద్యార్థులకు అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు జగన్.

బీసీల పై 26 వేల అక్రమ కేసులు పెట్టి వేధించింది వైసిపి ప్రభుత్వం.

అందుకే టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.

న్యాయ పోరాటానికి కావాల్సిన ఆర్ధిక సహాయం కూడా ప్రభుత్వమే అందిస్తుంది.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం.

ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవీకరణ పత్రాలను పంపుతాం.

వాల్మీకి, బోయాల్ని మోసం చేసింది వైసిపి ప్రభుత్వం.

వాల్మీకి, బోయల్ని ఎస్టీల్లో చేర్చాలని సత్యపాల్ కమిటీ వేసాం. అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టిడిపి.

నాలుగేళ్లు పడుకొని ఇప్పుడు కొత్త తీర్మానం అంటూ జగన్ వాల్మీకి, బోయలకు తీరని అన్యాయం చేశాడు.

వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.200 కోట్లు నిధులు ఇచ్చింది టిడిపి.

వాల్మీకిలు ఏ వృత్తి లో ఉన్నా వారిని ఆర్దికంగా ఆదుకోవడానికి సబ్సిడీ రుణాలు అందజేస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కురుబ సామాజికవర్గం వారికి గొర్రెలు కొనడానికి రుణాలు అందిస్తాం. ఇన్స్యూరెన్స్ కల్పిస్తాం. మందులు తక్కువ ధరకు అందిస్తాం.

దూదేకుల ముస్లీం లకు ఆదుకొనే బాధ్యత నాది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాం.

రజక సోదరులను ఆదుకుంది టిడిపి ప్రభుత్వం.

గతంలో దొబి ఘాట్స్ , వాషింగ్ మిషన్, ఐరెన్ బాక్సులు అందజేసాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాషింగ్ మెషిన్ తో పాటు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.

వైసిపి నాయకులు ఎమ్మెల్యేలు అయ్యింది షర్టు, ప్యాంటు విప్పి షో చెయ్యడానికా?

దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఎంటి అని నేను అంటే ఫేక్ వీడియో తయారు చేశారు.

అది పట్టుకొని ఆదిమూలపు సురేష్ షర్టు విప్పి బాబు గారి కాన్వాయ్ పై రాళ్ళు వేశారు.

అయ్యా ఆదిమూలం గారు మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే దళితుల పై దమనకాండ చేస్తున్న జగన్ ని ఎందుకు ప్రశ్నించలేదు.

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ ఎంతో మందిని వైసిపి నాయకులు చంపేస్తే సురేష్ గారు ఎందుకు నోరు విప్పలేదు.

విదేశీ విద్య కు అంబేద్కర్ గారి పేరు తొలగించి జగన్ పేరు పెట్టుకున్నప్పుడు సురేష్ గారు ఎక్కడ ఉన్నారు?

దొంగ వీడియో తయారు చేసి హడావిడి చేసే సాక్షి యజమాని భారతి రెడ్డి గారికి కి సవాల్ విసిరితే ఇప్పటి వరకూ సమాధానం లేదు.

జగన్ చంచల్గూడా జైలు కి బ్రాండ్ అంబాసిడర్.

ఒక బాబాయ్ ని అరెస్ట్ చేసిన కేసులో ఇంకో బాబాయ్ చంచల్ గుడా జైలుకి వెళ్ళారు.

అందుకే జగన్ ని చూసి కంపెనీలు రావడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తాం.

నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి బీసీ లకి రిజర్వేషన్లు కల్పించి పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం.

దామాషా ప్రకారం బీసీ ఉప కులాలకు నిధులు, సంక్షేమ కార్యక్రమాలు కేటాయిస్తాం.

రాయలసీమ ప్రాంతాన్ని హర్టికల్చర్ హబ్ గా మారుస్తాం.

ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.

పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేథి వ్యవసాయానికి సాగు నీరు అందిస్తాం.

గతంలో ఎలా అయితే సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని అమలు చేశామో అలానే అందిస్తాం.

రాయలసీమ దాటే లోపు రాయలసీమ అభివృద్ది పై బ్లూ ప్రింట్ విడుదల చేస్తాను.

తల్లి, చెల్లిని మెడ పట్టి బయటకి గెంటేశారు. బాబాయ్ కి, చెల్లికి న్యాయం చెయ్యలేని వాడు బిసిలకు న్యాయం చేస్తాడా?

బిసి కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం.

దామాషా ప్రకారం ఉప కులాల వారీగా ముందు నియోజకవర్గం ఆ తరువాత మండల స్థాయిలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం.

పాలు ఇచ్చే ఆవు కావాలో, తన్నే దున్నపోతు కావాలో ఆలోచించుకోండి.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *