రెడ్డి సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి

రెడ్డి సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి

రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులంతా టీడీపీ హయాంలో ఏం జరిగింది? వైసీపీ హయాంలో ఏం జరుగుతుంది? అనేది ఆలోచించాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏనాడూ రాష్ట్ర పరువును దిగజార్చలేదు. చంద్రబాబు చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన కొనసాగించారు. కానీ జగన్ రాష్ట్ర పరువును దిగజార్చాడు. రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు అని లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గం తూట్రాలపల్లి గ్రామంలో రెడ్డి సామాజిక వర్గీయులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సామాజిక వర్గీయులు లేవనెత్తిన పలు సందేహాలను లోకేష్ నివృత్తి చేశారు.

తాడిపత్రిలో ఉన్న రెడ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మీ పరిపాలన వస్తే మాపై అక్రమంగా పెట్టిన కేసులను తొలగిస్తారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్లు ఆర్థికంగా చితికిపోయారు. మీరు మాకు ఎటువంటి భరోసా కల్పిస్తారు?వ్యవసాయం చేస్తున్న రెడ్డి రైతులు జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయారు. మీరు అధికారంలోకి వస్తే మమ్మల్ని ఎలా ఆదుకుంటారు?నిరుపేద రెడ్లకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను ఆధారంగా చేసుకుని 10శాతం రిజర్వేషన్ అమలు కల్పించాలి. మీరు అధికారంలోకి వస్తే అమలు చేస్తారా? కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దాన్ని అడ్డుకోకపోతే మా ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిపోతుంది. మీరు అధికారంలోకి వస్తే దాన్ని ఆపుతారా? హంద్రీనీవా పనులను జగన్ నిలిపేశాడు. మీరు దాన్ని పూర్తిచేస్తారా? అని పలువురు ప్రతినిధులు లోకేష్ ను ప్రశ్నించారు.

రెడ్డి సామాజిక ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిస్తూ జగన్ చేతిలో తాడిపత్రిలోని రెడ్లు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు మొత్తం బాధితులే. సీనియర్ నాయకులు బీసీ జనార్థన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సోమిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి లపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధించింది. వైసీపీ పాలనలో పెట్టిన ఒక్క కేసు కూడా నిలబడవు. ఎందుకంటే అవన్నీ అక్రమ కేసులే. టిడిపి అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులన్నీ మాఫీ చేస్తాం. తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారికి శిక్ష పడేలా చేస్తాం అని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పేద రెడ్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డ్రిప్ విధానం రాయలసీమకు ఎంత ముఖ్యమో నేను కళ్లారా చూశాను.

రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్ కు రాయలసీమకు డ్రిప్ ఎంత ముఖ్యమో తెలియదా? డ్రిప్ ఎందుకు రద్దు చేశాడు? మేం అధికారంలో ఉండగా డ్రిప్ ను సబ్సిడీపై ఇచ్చాం. నేడు ఆ ఫలితాలు చూస్తున్నాం. జగన్ రెడ్డి సీఎం అయ్యాక డ్రిప్ రద్దు చేయడం వల్ల రైతులు నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలోనే ఏపీని రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానానికి తెచ్చాడు. మేం అధికారంలోకి వచ్చాక డ్రిప్, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై గతంలో ఏ విధంగా అందించామో మళ్లీ ఆ విధానాలను పునరుద్ధరిస్తామని వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ తో అనుసంధానం చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టి చీనీ తదితర పంటలకు లాభాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. రెడ్ల కార్పొరేషన్ ను మేం అధికారంలోకి వచ్చాక బలోపేతం చేస్తాం. పేద రెడ్లకు అభివృద్ధిలోకి తీసుకొస్తాం.

అప్పర్ భద్ర ప్రాజెక్టును నేను నా పాదయాత్ర ప్రారంభం నుండి వ్యతిరేకిస్తూనే వచ్చా. హంద్రీనీవా ప్రాజెక్టును మేం 90శాతం పూర్తిచేశాం. మిగిలిన దాన్ని జగన్ రెడ్డి గాలికొదిలేశాడు. రాయలసీమపై ప్రేమ ఉంటే పూర్తి చేసేవాడు అని విమర్శించారు. అప్పర్ భద్రపై టీడీపీ నుండి కేంద్రానికి లేఖ రాసి, మన అభ్యంతరం చెప్పి ఆపేందుకు ప్రయత్నిస్తాం. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుంసధానం చేసి శాశ్వతంగా రాయలసీమ నీటి కష్టాలను పరిష్కరిస్తామని తెలిపారు. పోలవరాన్ని, ఇతర నీటి ప్రాజెక్టులను పూర్తిచేసేది…రిబ్బన్ కట్ చేసేది చంద్రబాబే. మీకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే అమలు చేస్తామని చెప్పారు.

ఈ డబ్ల్యూ ఎస్ అమలు చేస్తాం

రాజకీయాల్లో రాజనీతి ఉండాలి. లక్ష్మణరేఖ దాటకూడదు.రెడ్డి సోదరులకు గౌరవం దక్కింది టీడీపీ పాలనలోనే జగన్ పాలనలో రెడ్డి సోదరులు కూడా బాధితులే కాంట్రాక్టులు చేసిన రెడ్లు ఆత్మహత్యలు చేసుకనే దుస్థితి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద రెడ్లను ఆదుకుంటాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను కూడా అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్ పై పోటీ చేశారు. మేం జేసీని రాజకీయ ప్రత్యర్థిగానే చూశాం తప్ప, ఏనాడూ వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడలేదు.రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కూడా ఏనాడూ వ్యక్తిగత దూషణలకు పోలేదు అని చెప్పారు. రాష్ట్రమంతా తాడిపత్రిలో ఏం జరుగుతుందో చూస్తోంది. ప్రత్యర్థి ఇంటికెళ్లి కూర్చుని రెచ్చగొట్టే ఫ్యాక్షన్ రాజకీయం నేడు తాడిపత్రిలో జరుగుతోంది..జగన్మోహన్ రెడ్డి సాక్షిగా నా తల్లిని అసెంబ్లీలో అవమానించారు. గత చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదు అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలు జగన్ పాలనలో అవమానాలు, దాడులు, హత్యలు, అక్రమ కేసులకు గురవుతున్నారు. రెడ్డి సామాజికవర్గం కూడా జగన్ పాలనలో బాధితులుగా మారారు.

టీడీపీ పాలనలో ఏనాడూ రెడ్డి సోదరులపై అక్రమ కేసులు పెట్టలేదు. వ్యాపారాలు చేసుకునే వారిని వేధించలేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా జవహర్ రెడ్డి పనిచేశారు. ఇద్దరం కలిసి పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం.2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు రెడ్లు ఎంతో కష్టపడ్డారు. ఆస్తులు కూడా కోల్పోయారు. కానీ జగన్ పాలనలో రెడ్లకు దక్కింది అవమానాలే. కేవలం నలుగురు రెడ్లు మాత్రమే జగన్ పాలనలో బాగుపడ్డారు. మిగిలిన వారికి కనీసం జగన్ అపాయింట్ మెంట్ కూడా దక్కలేదు అని వివరించారు. టీడీపీ హయాంలో అన్ని కులాల వారిని సమానంగా చూశాం.

తెలుగుదేశంపార్టీ వివిధ సామాజికవర్గాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అని విమర్శించారు. మేం అధికారంలోకి వచ్చాక రెడ్డి కార్పొరేషన్ కు దామాషా ప్రకారం నిధులు కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. జగన్ రాష్ట్ర పరువును దిగజార్చాడు. రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. యువత భవిష్యత్తు సర్వనాశనం చేశాడు.ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి, కంపెనీ, పరిశ్రమ ఏదీ రాలేదు. రాష్ట్ర ప్రజలు బతుకుదెరువుకోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. రాష్ట్రాన్ని కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకునేందుకు రెడ్డి సోదరులంతా కలిసికట్టుగా ముందుకు రావాలని కోరుతున్నా అని లోకేష్ పిలుపునిచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *