రాయలసీమలో యువగళం పాదయాత్ర రికార్డ్స్

రాయలసీమలో యువగళం పాదయాత్ర రికార్డ్స్

• జనగళమే యువగళమై మహోద్యమంగా సాగిన యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర సృష్టించింది.

• ఇప్పటివరకు మరే నేత చేయని విధంగా యువనేత నారా లోకేష్ మారుమూల కుగ్రామాలను సైతం స్పృశిస్తూ లక్షలాదిమంది ప్రజలను కలుసుకొని వారి కష్టాలు తెలుసుకున్నారు.

• యువగళంలో భాగంగా నారా లోకేష్ రాయలసీమలో 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాలు, 108 మండలాలు, 943 గ్రామాల మీదుగా 1587.7 కి.మీ. మేర పాదయాత్ర సాగించారు.

• (2018లో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాయలసీమలో 68రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 930.3 కి.మీ. మేర పాదయాత్ర చేశారు).

• నారా లోకేష్ రాయలసీమలో చిత్తూరు 45 – 577 (14), అనంతపురం 23 – 303 (9), కర్నూలు 40 – 507 (14), కడప 16 – 200.7 (7). మొత్తం 44 – 124 – 1587.7 కి.మీ.

• జగన్ రాయలసీమలో చిత్తూరు 23 – 291.4 (10), అనంతపురం 20 – 279.4 (9), కర్నూలు 18 – 263 (7), కడప 7 – 93.8 (5). మొత్తం 31 – 68 – 930.3 కి.మీ.

• 124రోజుల సుదీర్ఘ పాదయాత్రలో యువనేత లోకేష్ కు వివిధవర్గాల నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 2,228 రాతపూర్వక వినతిపత్రాలు అందాయి.

• కనీవినీ ఎరుగని విధంగా యువగళం పాదయాత్రలో సుమారు 20లక్షలమంది ప్రజలు భాగస్వాములయ్యారు.

• సీమ ప్రజల కష్టాలను దగ్గరగా చూసిన యువనేత లోకేష్ కడపలో 7-6-2023న మిషన్ రాయలసీమను ప్రకటించారు.

• అధికారంలోకి వచ్చన అయిదేళ్లలో మిషన్ రాయలసీమ ద్వారా సీమప్రజల కన్నీళ్లు తుడుస్తానని, అలాచేయని నాడు కడప నడిబొడ్డున నన్ను నిలదీయవచ్చని చెప్పిన ధీరుడు యువకెరటం నారా లోకేష్.

• రాయలసీమలో అడుగుపెట్టనీయం అన్న వైసిపి ముష్కరమూకలకు నాలో ఉన్నది రాయలసీమ రక్తమే, క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా అంటూ ధీటైన సమాధానమిచ్చారు.

• ప్రజల మనసు గెలుచుకున్నపుడే నారా లోకేష్ నాయకుడు లోకేష్ అవుతాడు, ప్రజల భవిష్యత్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉందంటూ చెప్పిన మాటలు లోకేష్ నిజాయితీకి నిలువుటద్దంగా నిలుస్తాయి.

• మొత్తమ్మీద గత రికార్డులను బ్రేక్ చేస్తూ 124రోజులపాటు రాయలసీమలో ప్రభంజనంలా సాగిన యువగళం పాదయాత్ర అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు మనోధైర్యం, భరోసా కల్పించింది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *