కొండపి నియోజకవర్గం మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

కొండపి నియోజకవర్గం మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.

టిడిపి హయాంలో సైలేజ్, మినరల్ మిశ్చర్ సబ్సిడీ లో అందించేవారు. జగన్ పాలనలో పాడి రైతులకు ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు.

ఒంగోలు డైరీని అముల్ కి ఇచ్చేశారు. ఇప్పుడు అమూల్ కూడా ఆ డైరీ నీ మూసేసింది.

జగన్ కోఆపరేటివ్ డైరీల ఆస్తులను అమూల్ కి అప్పగిస్తున్నాడు. గతంలో జగన్ హెరిటేజ్ పాడి రైతుల్ని దోచుకుంటుంది అని జగన్ ప్రచారం చేశారు.

ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు అభివృద్ది కోసం జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

టిడిపి హయాంలో పశువులు కొనడానికి సబ్సిడీ లో రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ ఆ పథకాన్ని ఆపేసింది.

హెరిటేజ్ లో పనిచేశారు. పాడి రైతుల సమస్యల పై మీకు ఉన్న అవగాహన ఎంటి? టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి రైతుల అభివృద్ది కోసం ఎం చేస్తారు?

తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. క్లోరైడ్ వలన అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం.

… కొండపి పాడి రైతులు

నారా లోకేష్ మాట్లాడుతూ

వ్యవసాయం తో పాటు పాడి పరిశ్రమ ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి అనేది టిడిపి విధానం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి రైతుల పెట్టుబడి తగ్గిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పశువులు కొనడం దగ్గర నుండి పశుగ్రాసం, దాణా, మందులు సరఫరా వరకూ అన్ని సబ్సిడీలో అందిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మినీ గోకులం లు నిర్మిస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమను దేశంలోనే నంబర్ 1 చేసే లక్ష్యంతో పనిచేస్తాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ధరలు తగ్గిస్తాం.

పాడి రైతులకు అనేక హామీలు ఇచ్చి జగన్ మోసం చేసాడు.

లీటర్ కి అదనంగా రూ.4 బోనస్ ఇస్తానని మోసం చేసాడు.

పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది.

టిడిపి హయాంలో పశువులు కొనడం దగ్గర నుండి పశుగ్రాసం, దాణా, మందులు సబ్సిడీలో అందించాం.

జగన్ అన్ని సబ్సిడీలు ఎత్తేసాడు.

టిడిపి హయాంలో గోపాలమిత్ర లను పెట్టి పశువులకు వైద్యం ఉచితంగా అందించాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పాడి రైతులకు ఇచ్చిన అన్ని సబ్సిడీలు అందిస్తాం.

ఒంగోలు డైరీ మూతపడే పరిస్థితి వస్తే రూ.35 కోట్లు గ్రాంట్ ఇచ్చి డైరీ ని నడిపించారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేసిన ఒంగోలు డైరీని తిరిగి ప్రారంభిస్తాం.

విజయ డైరీ తెరుస్తా అని చెప్పి ఆస్తులు అన్ని అమూల్ కి కట్టబెట్టాడు జగన్.

1992 లో హెరిటేజ్ డైరీ ని చంద్రబాబు గారు ప్రారంభించారు.

చంద్రబాబు గారు కోఆపరేటివ్ డైరీ లను ఆదుకున్నారు.

మేము విలువలతో హెరిటేజ్ కంపెనీ ని నడిపిస్తున్నాం. రైతులకు సమయానికి డబ్బులు ఇస్తుంది హెరిటేజ్ కంపెనీ.

ప్రైవేట్, ప్రభుత్వ డైరీలు ఉన్నప్పుడే పాడి రైతులకు మేలు జరుగుతుంది.

మన రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ డైరీలను అభివృద్ది చెయ్యాలి అనేది నేను బలంగా నమ్ముతున్నాను.

వేరే రాష్ట్రానికి చెందిన అమూల్ కంపెనీ కి జగన్ వేల కోట్ల ఆస్తులు కట్టబెడుతున్నాడు.

మాకు ఫీడ్ కంపెనీ కూడా ఉంది కానీ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు మా కంపెనీ ఫీడ్ కొనాలి, హెరిటేజ్ కే పాలు పొయ్యాలి అనే డిమాండ్ ఎప్పుడూ చెయ్యలేదు.

జగన్ మాత్రం ఒక్క అమూల్ కే పాలు అమ్మాలి అనే నిబంధన పెడుతున్నారు. గుజరాత్ కి చెందిన కంపెనీ పై అంత ప్రేమ ఎందుకు?

విజయ, సంఘం, విశాఖ, విజయ లాంటి కోపరారివ్ డైరీలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి అనేది టిడిపి ఆలోచన. జగన్
గుజరాత్ కి చెందిన కంపెనీకి కోఆపరేటివ్ డైరీ ల ఆస్తులు అప్పన్నంగా కట్టబెట్టడం మంచిది కాదు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒంగోలు జాతి ఆవులు, ఎద్దుల అభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.

హెరిటేజ్ కంపెనీ లో పని చేసినప్పుడు పాడి రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు అమలు చేశాను.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందిస్తాం.

జగన్ గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీశాడు. కరెంట్ ఛార్జీలు, రాయల్టీ విపరీతంగా పెంచేసి పరిశ్రమలు మూతపడేలా చేసాడు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత గ్రానైట్ పాలసీ అమలు చేస్తాం. పెంచిన పన్నులు తగ్గిస్తాం. మూసేసిన గ్రానైట్ పరిశ్రమలను తెరుస్తాం.

2019 గాలిలో కూడా ప్రకాశం జిల్లా ప్రజలు మా గౌరవాన్ని కాపాడారు. మిమ్మలని గుండెల్లో పెట్టుకుంటాం.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా యువత కు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం.

కియా, ఫాక్స్ కాన్, హెచ్సిఎల్ చంద్రబాబు గారి బ్రాండ్లు…

బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ జగన్ బ్రాండ్లు.

 

కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి

టిడిపి హయాంలో పాడి రైతుల్ని ఆదుకున్నాం.

25 వేల కే లక్ష రూపాయలు విలువ చేసే గేదెలు సబ్సిడీలో అందించాం.

సైలేజ్, మినరల్ మిశ్చర్ సబ్సిడీలో అందించాం.

ఇప్పుడు జగన్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసి పాడి రైతుల్ని దెబ్బతీశాడు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *