డక్కిలి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.

డక్కిలి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్.

హ్యాండ్ లూమ్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదు. మగ్గం నేసే వారిని మాత్రమే చేనేత కార్మికులుగా గుర్తిస్తున్నారు. నేత లో ఉన్న ఇతర కార్మికులను కూడా గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలి. జగన్ పాలనలో చేనేత కు వచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. చేనేత కార్మికుల కుటుంబం మొత్తం రోజంతా కష్టపడితే రూ.500 కూడా రాని పరిస్థితి. చేనేత కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. జగన్ పాలనలో రుణాలు అందడం లేదు. జగన్ పాలనలో చేనేత ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

వెంకటగిరి చేనేత ఉత్పత్తులను అమ్మడానికి ఒక కాంప్లెక్స్ కావాలి. చేనేత కార్మికులకు పెన్షన్ తో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలి. పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ ఉత్పత్తుల మధ్య తేడా తెలిసేలా ప్రత్యేక బ్రాండింగ్ ఉండేలా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కూడా మాకు రావడం లేదు అని వెంకటగిరి నియోజకవర్గం చేనేత కార్మికులు వాపోయారు

లోకేష్ మాట్లాడుతూ… కుల వృత్తులను కాపాడటమే టిడిపి లక్ష్యం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులను నేను దత్తత తీసుకుంటాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. జనతా వస్త్రాల పథకం తీసుకొచ్చి చేనేత కార్మికులను ఆదుకుంది టిడిపి. మంగళగిరి లో వీవర్స్ శాల అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటగిరి లో మెరుగైన మోడల్ తో టెక్స్ టైల్ పార్క్ తీసుకొస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఒకే సంతకంతో రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది టిడిపి.

చేనేత కార్మికుల సమస్యల పై నాకు పూర్తి అవగాహన ఉంది. యార్న్ సబ్సిడీ, కలర్ సబ్సిడీ, పట్టు సబ్సిడీ అందజేసింది టిడిపి. ఆదరణ పథకంలో భాగంగా 50 శాతం సబ్సిడీ తో మగ్గాలు అందజేసింది టిడిపి. వర్షాకాలంలో చేనేత కార్మికులకు పెన్షన్ ఇచ్చింది టిడిపి. కానీ మీరు పాలిచ్చే ఆవుని వద్దని తన్నే దున్నపోతు తెచ్చుకున్నారు. జగన్ వచ్చిన తరువాత చేనేత కు ఇచ్చే అన్ని సబ్సిడీలు రద్దు చేశారు. యార్న్, కలర్, పట్టు సబ్సిడీ జగన్ ఎత్తేశారు. జగన్ పాలనలో 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. నేతన్న నేస్తం అంటూ జగన్ మోసం చేసాడు.

సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం అంటూ కండిషన్స్ పెట్టాడు. జగన్ పాలనలో ఆప్కో ని బ్రష్టు పట్టించాడు. జగన్ పాలనలో ఆప్కో బకాయిలు పడింది. మార్కెట్ తో లింక్ చేసినప్పుడు మాత్రమే చేనేత కార్మికులకు మేలు జరుగుతుంది. చేనేత ను కాపాడటమే టిడిపి లక్ష్యం. ఏపిపిఎస్సీని బలోపేతం చేసి హ్యాండ్ లూమ్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేస్తాం. జగన్ ప్రభుత్వం ఐపీ పెట్టేసింది. అప్పుల్లో కూరుకుపోయింది. హ్యాండ్ లూమ్ లో కూడా అధునాతన టెక్నాలజీ వచ్చింది. చేనేత కార్మికుల శ్రమ తగ్గే అవకాశం ఉంది. హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ కి మధ్య తేడా తెలిసేలా ప్రత్యేక బ్రాండింగ్ తీసుకురావడం కోసం కార్యాచరణ రూపొందిస్తాం.

హ్యాండ్ లూమ్ ఉన్న చోట పవర్ లూమ్ పెట్టకుండా నిబంధనలు రూపొందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజకీయాలకు అతీతంగా చేనేత గుర్తింపు కార్డులు అందజేస్తాం. పట్టు రైతుల దగ్గర నుండి చేనేత లో రంగుల అద్దే కార్మికుల వరకూ అందరినీ ఆదుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తిరిగి ప్రారంభించి సబ్సిడీ లో పనిముట్లు అందజేస్తాం. జగన్ పాలనలో సామాన్యులు బ్రతకడం కష్టంగా మారింది అందుకే చంద్రబాబు గారు భవిష్యత్తు కి గ్యారెంటీ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పేరుతో రూ.15 వేలు ఇస్తాం. ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45 వేలు ఇస్తాం.

మంగళగిరి లో టాటా కంపెనీ తో ఒప్పందం చేసుకొని ఒక పైలట్ ప్రాజెక్టు చేస్తున్నాం. మెరుగైన వసతులతో షెడ్లు నిర్మాణం చేసి చేనేత కార్మికులు అక్కడికి వచ్చి చీరలు నేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. తయారు అయిన చీరలు టాటా ద్వారా విక్రయిస్తున్నాం. ఒక వేళ ఆ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి చేనేత ఉత్పత్తుల ను మార్కెట్ కి లింక్ చేసి కార్మికులకు లబ్ధి చేకూరేలా చేస్తాం. వెంకటగిరి చేనేత కు బ్రాండ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వెంకటగిరి చీరలు అమ్మ, బ్రహ్మణి కట్టుకుంటారు. వెంకటగిరి చేనేత కార్మికులను ఆదుకొనే బాధ్యత నాది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఆదుకుంటాను.

నూతన డిజైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం తో కేంద్ర సంక్షేమ కార్యక్రమాలు కూడా చేనేత కార్మికులకు అందడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే యార్న్, కలర్, పట్టు సబ్సిడీ లు తిరిగి అందిస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టు రైతులను ఆదుకుంటాం. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు అందజేస్తాం. చేనేత లో పెట్టుబడి తగ్గేలా చర్యలు తీసుకుంటాం. పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కి మధ్య తెలిసేలా ప్రత్యేక ట్యాగ్ రూపొందిస్తాం. ప్రత్యేక జోన్లు ప్రకటిస్తాం. చేనేత పై జీఎస్టీ భారం పడకుండా చూస్తాం. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటాం.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *