బొల్లవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం : నారా లోకేష్ హామీ

బొల్లవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం : నారా లోకేష్ హామీ

టిడిపి అధికారలోకి వచ్చిన వెంటనే బొల్లవరం గ్రామాన్ని అభివృద్ది చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం పాణ్యం నియోజకవర్గం బొల్లవరం గ్రామస్తులు యువనేతను లోకేష్ ను కలిసి సమస్యలను విన్నివించారు. మా గ్రామానికి 180 మీటర్ల దూరంలో శ్మశానవాటిక ఉంది.

నాలుగేళ్లుగా పంచాయతీవారు చెత్తను శ్మశానంలో డంప్ చేస్తున్నారు. శ్మశానానికి వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోంది. ఈ విషయాన్ని పంచాయతీ, మండల అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం. చెత్త వల్ల కాలుష్యం అధికమై గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యను పరిష్కరించాలి అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

పోరాటాల పురిటగడ్డ బొల్లవరంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. ఉద్యమ వీరులకు నా జోహార్లు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో శ్మశానాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. వైసీపీ నాయకులు శ్మశానాలను కూడా వదలకుండా ఆక్రమిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రహరీగోడలు నిర్మించి శ్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా చూస్తాం. చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *