దేవనకొండ లో మోడల్ స్కూల్ ఏర్పాటు : నారా లోకేష్ హామీ

దేవనకొండ లో మోడల్ స్కూల్ ఏర్పాటు : నారా లోకేష్ హామీ

టీడీపీ అధికారంలోకి వచ్చాక దేవనకొండలో మోడల్ స్కూల్ ఏర్పాటుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం దేవనకొండలో ఆలూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ ప్రతినిధులు లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో మోడల్ స్కూళ్లు ఉన్నాయి. దేవనకొండలో మోడల్ స్కూల్ లేకపోవడంతో పక్క మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. తమ గ్రామంలో మోడల్ స్కూలు ఏర్పాటుచేస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచితవిద్య అందుబాటులో ఉంటుంది.

టిడిడి అధికారంలోకి వచ్చాక దేవనకొండలో మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి అని వారు కోరారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వంలో మోడల్ స్కూళ్లు, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లతో పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచితవిద్య అందించాం. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లు రద్దు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసింది. స్కూళ్ల విలీనంతో 4 లక్షల మంది పేద విద్యార్థులు బడులకు దూరమయ్యారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *