ఎస్సీ సంక్షేమ పధకాలన్నీ బేడ,బుడగ జంగాలకూ వర్తింపు  నారా లోకేష్ హామీ

ఎస్సీ సంక్షేమ పధకాలన్నీ బేడ,బుడగ జంగాలకూ వర్తింపు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీలకు వర్తించే సంక్షేమ పథకాలన్నింటినీ బేడ,బుడగ జంగాలకు వర్తింపజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం కోడుమూరు హంపయ్య సర్కిల్ లో బుడగ జంగాల ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బేడ, బుడగ జంగాలను ఎస్సీలుగా
పరిగణించే అంశంపై జెసి శర్మ కమిషన్ నివేదిక ఆమోదించి, కేంద్రానికి పంపేలా వత్తిడి తేవాలి.
సంచార జాతిగా ఉన్న బేడ/బుడగ జంగాలు పేదరికంలో మగ్గుతున్నారు.
మా జీవితాలకు ఉరితాడుగా
పరిణమించిన 2008నాటి జిఓ 144ను రద్దుచేయాలి.
బేడ/బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలుతీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిపై నారా లోకేష్ సానుకూలంగా
స్పందించారు. బేడ, బుడగ జంగాల సమస్యపై వైసిపి ప్రభుత్వం నాన్పుడు ధోరణితో వ్యవహరిస్తోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సామాజికర్గానికి న్యాయం చేస్తాం.
కేంద్రం అడిగిన క్లారిఫికేషన్లకు
సమాధానమిచ్చి, సమస్య పరిష్కరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *