ఎమ్మిగనూరు లో నూతన కోర్టు భవన నిర్మాణం పరిశీలనకు నారా లోకేష్ హామీ

ఎమ్మిగనూరు లో నూతన కోర్టు భవన నిర్మాణం పరిశీలనకు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే ఎమ్మిగనూరులో నూతన కోర్టు భవనం నిర్మించే అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఎమ్మిగనూరులో న్యాయవాదులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మిగనూరు కోర్టులో కక్షిదారులకు మంచినీరు, టాయ్ లెట్ సౌకర్యాలు కూడా లేవు.ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సుమారు 4వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటుచేయాలి.ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థలో ఉన్నందున కొత్త కోర్టు భవనాన్ని నిర్మించాలి.

గోనెగుండ్ల మండలాన్ని ఎమ్మిగనూరు జూనియర్ జడ్జి కోర్టు పరిధిలోకి తేవాలి.

ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ పరిధిలోని న్యాయవాదులు,గుమాస్తాలకు ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు అందజేయాలి వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయవాదులు, న్యాయస్థానాలపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టులోనే కనీసం టీ దొరకడం లేదని ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.

గోనెగుండ్ల మండలాన్ని ఎమ్మిగనూరు కోర్టు పరిధిలోకి తీసుకొచ్చే అంశం పై కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటాం.ఎమ్మిగనూరు న్యాయవాదులు, గుమాస్తాలకు ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు అందజేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *