గుక్కెడు నీళ్లకోసం అవస్థలు పడుతున్నాం : నారా లోకేష్ తో దైవలమడుగు మహిళల ఆవేదన

గుక్కెడు నీళ్లకోసం అవస్థలు పడుతున్నాం : నారా లోకేష్ తో దైవలమడుగు మహిళల ఆవేదన

డోన్ నియోజకవర్గం దైవాలమడుగులో మహిళలు యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దైవలమడుగు గ్రామంలో 200 ఇళ్లు ఉన్నాయి. అన్ని ఇళ్లకూ ఒక్కటే బోరు ఉంది. ఆ ఒక్క బోరుకు కూడా అరఇంఛ నీరు రావడం లేదు. నీళ్ల కోసం పోలాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. అవి కూడా త్రీ ఫేస్ కు వచ్చినప్పుడు మాత్రమే మోటార్లు ఆడుతాయి. రైతుల పొలాలకు డ్రిప్పు మందు వదలడం వల్ల ఆ నీళ్లు తెచ్చుకుని తాగడం వల్ల పలుమార్లు అనార్యోగపాలయ్యాం.

పొలాల్లోకి వెళ్లినా పంటలకు నీళ్లు అందడం లేదని, పంటను తొక్కుతున్నారని రైతులు కోప్పడుతున్నారు. తాగునీరు తెచ్చుకునేందుకు ఒక మనిషి పని మానుకుని ఇంటి వద్దే ఉండాల్సి వస్తోంది. నీళ్లు తెచ్చుకోవాలంటే ఇంటికి ఒక తోపుడు బండి, పదిహేను బిందెలు ఉండాల్సిందే. నిండుబిందెలు ఉన్న బండ్లు లాగలేక మహిళలు ఒక్కోసారి కిందపడిపోతున్నారు. గ్రామంలో ఏదైనా శుభకార్యం ఉంటే మంచినీటి ట్యాంకర్లకు వేల రూపాయలు ఖర్చు అవుతోంది. దైవాలమడుగుకు రాయలచెరువు నుండి గతంలో మంచినీళ్లు వచ్చేవి.

సత్యసాయి తాగునీటి పథకం ద్వారా రాయలచెరువు నుండి దైవాలమడుగుకు తాగునీరు వచ్చేవి. కానీ రాయలచెరువు నుండి చందన వరకు ఉన్న పైపు లైన్లు మరమ్మతులు చేయకపోవడంతో ప్రెజర్ తట్టుకోలేక పగిలిపోయాయి. మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. అనంతపురం జిల్లాకు సరిహద్దుల్లో ఉండటం వల్లే మాకు ఈ కష్టాలు. ఎన్నోసార్లు స్పందనలో ఫిర్యాదు చేసినా, కలెక్టరుకు వినతిపత్రాలిచ్చినా మా సమస్యకు పరిష్కారం చూపడం లేదు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

ప్రజలకు గుక్కెడు తాగునీరు అందించలేని చేతగా ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. అనంతపురం సరిహద్దు గ్రామాల్లో కర్నాటక మద్యం పారుతుంది తప్ప చుక్కనీరు దొరకడం లేదు. అక్రమంగా మట్టి తోలుకోవడానికి రాయల చెరువులో నీటిని నింపడం లేదు. టీడీపీ అధికారంలోకి రాగానే రాయలచెరువుకు నీళ్లు నింపి, పైపులైన్ల మరమ్మతులు చేసి దైవలమడుగుకు తాగునీళ్లు అందిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *