పాత క్రాప్ ఇన్స్యూరెన్స్ విధానాన్ని పునరుద్ధరిస్తాం  నారా లోకేష్ హామీ

పాత క్రాప్ ఇన్స్యూరెన్స్ విధానాన్ని పునరుద్ధరిస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే పాత క్రాప్ ఇన్సూరెన్స్ విధానాన్ని పునరుద్దరించి, పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.

యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం బొల్లవరం శివారులో చంటిబిడ్డను కాడిమధ్య ఉయ్యాలలో వేసి, సేద్యం చేస్తున్న రైతును యువనేత లోకేష్ రైతును కలిశారు.

అరక దున్నుతూ రైతన్న కష్టాలు తెలుసుకున్నారు. రైతు మౌలాలి మాట్లాడుతూ 3ఎకరాలు కౌలుకు తీసుకొని గతంలో మొక్కజొన్న వేశాను.

రూ.80వేలు పెట్టుబడి అయితే, వచ్చిన పంట పెట్టుబడికి సరిపోయింది. మూడెకరాలకు రూ.60వేలు చేతిడబ్బులు కట్టాను.

పంటనష్టపోయినపుడు అరకొర పరిహారం వచ్చినా అది భూయజమానులే తీసుకుంటున్నారు.

కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి వారిని ఆదుకోండి అని విజ్ఞప్తి చేశారు.

ఆ రైతు సమస్యపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో వ్యవసాయంపై అవగాహనలేని ముఖ్యమంత్రి కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

అకాలవర్షాల కారణంగా పంటలు నష్టపోతే కనీసం పొలాలను పరిశీలించే నాధుడులేడు.

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలురైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం.

పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.

రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తాం.

ఒక్క ఏడాదిలో చంద్రన్న ప్రభుత్వం రాబోతోంది. మీ అందరి కష్టాలు తీరుస్తారు అని లోకేష్ భరోసా ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *