అన్న‌య్య‌లా అండ‌గా నిలుస్తా..చ‌దివిస్తా..  – కూలిప‌నులు చేస్తున్న ఆడ‌పిల్ల‌ల‌కి నారా లోకేష్ భ‌రోసా

అన్న‌య్య‌లా అండ‌గా నిలుస్తా..చ‌దివిస్తా.. – కూలిప‌నులు చేస్తున్న ఆడ‌పిల్ల‌ల‌కి నారా లోకేష్ భ‌రోసా

ఆ నిరుపేద తండ్రికి ముగ్గురు అమ్మాయిలు. పెద్ద‌మ్మాయిని చ‌దివిస్తున్నాడు. మిగిలిన ఇద్ద‌రు పిల్ల‌లు చ‌దువు మానేసి తండ్రితోపాటే కూలీ ప‌నుల‌కి వెళ్ల‌డం, కూల్ డ్రింక్స్ షాప్ నిర్వ‌హించ‌డంలో చేదోడుగా ఉంటున్నారు. మండే ఎండ‌ల్లో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం,కూడేరు మండ‌లం, క‌మ్మూరు గ్రామానికి చెందిన ప‌న‌క‌చ‌ర్ల రామ‌లింగం జీవ‌న‌పోరాటం ఇది. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో రామ‌లింగం కుటుంబం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసింది.

పెద్ద బిడ్డ ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంద‌ని, మిగిలిన ఇద్దరినీ చదివించే స్థోమ‌త లేక‌పోవ‌డంతో త‌న‌తోపాటు కూలీ ప‌నుల‌కి, జ్యూస్ షాపులో ప‌నికి వ‌స్తున్నార‌ని రామ‌లింగం లోకేష్ వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నేను మీకు అన్న‌లా అండ‌గా ఉండి చ‌దివిస్తానంటూ లోకేష్ భ‌రోసా ఇవ్వ‌డంతో అమ్మాయిలు లిఖిత‌, గౌరీల ఆనందంతో ఎగిరి గంతేశారు. త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య అయినా, స‌హాయం అయినా నారా లోకేష్ అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *