చేనేతలకు అధునాతన శిక్షణా కేంద్రాలు : నారా లోకేష్ హామీ

చేనేతలకు అధునాతన శిక్షణా కేంద్రాలు : నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతలు అధునాతన సాంకేతిక పరిజ్జానానికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళంపాదయాత్రలో భాగంగా గురువారం ప్రొద్దుటూరు లో చేనేత సామాజిక వర్గీయులు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు. సాంప్రదాయ చేనేత కార్మికులు ఇప్పటికీ పాతపద్ధతులతోనే వస్త్రాలను తయారుచేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసి, అధునాతన పరికరాల కొనుగోలుకు రాయితీ ఇవ్వాలి.

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకొని, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. గతంలో ఆదరణ పథకం కింద చేనేతలకు పనిముట్లు అందజేయగా, ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. మీరు అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని పునరుద్దరించాలి. ప్రొద్దుటూరులో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేసి చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి విజ్ఞప్తులపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. గతంలో చేనేతలను అప్పులఊబినుంచి బయటకు తెచ్చేందుకు రూ.110 కోట్లతో రుణమాఫీ చేశాం. నూలు, రంగులు, సిల్క్ సబ్సిడీలను అందించి చేనేత కార్మికులకు అండగా నిలచాం. ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించి చేనేతలకు అవసరమైన పరికరాలను సబ్సిడీపై అందిస్తాం. చేనేతల ఉత్పత్తులకు బ్రాండింగ్ చేసి, జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *