అమరావతిలో జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు  నారా లోకేష్ హామీ

అమరావతిలో జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే అమరావతిలో జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రసందర్భంగా బుధవారం కోడుమూరు వెల్దుర్తి రోడ్డులో రాయలసీమ మాదిగ దండోరా ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. జనాభా ప్రాతిపదికన మాదిగలకు ఎమ్మెల్యే టిక్కెట్లు
కేటాయించాలి.

ఎస్సీ నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగాలు పొందేలా సహకరించాలి.

ఎస్సీలకు నాణ్యమైన విద్య అందించేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విధానాన్ని పునఃప్రారంభించాలి.

ఎస్సీలకు గత ప్రభుత్వం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్దరించాలి.

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్ లో వేసవికాలంలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. గండ్రేవుల, వేదావతి, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో చేపట్టి వలసలను నివారించాలి.

టిడిపి అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి.

అమరావతి రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతోపాటు బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

అధికారంలోకి వచ్చాక రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.

27ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేసి దళితులకు తీరని అన్యాయం చేశారు. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ పునరుద్దరిస్తాం.

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ లను రద్దుచేసిన వైసిపి ప్రభుత్వం పేద ఎస్సీలను విద్య, ఉద్యోగాలకు దూరం చేశారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తిచేసి వలసలను నివారిస్తాం.

మాదిగల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *