ఆదోనిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం  నారా లోకేష్ హామీ

ఆదోనిలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే ఆదోనిలో మిర్చి రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం మంత్రాలయం నియోజకవర్గం లచ్చుమర్రి సమీపంలో పొలంలోకి దిగిన యువనేత లోకేష్ అక్కడ టమోటా, మిర్చి పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా డి.బెళగల్ కు చెందిన రైతు తలారి హుస్సేన్ మాట్లాడుతూ ఎకరా టమోటా, ఎకరా మిర్చి నాటాను. కల్తీ విత్తనాల వల్ల టమోటా, మిర్చి రెండూ దెబ్బతిన్నాయి.

మిర్చి మొక్కల్లో బుడ్డలు దిగి కాయ సైజు పెరగలేదు. దానికి తోడు తెగులు కూడా సోకింది. మొక్కలు తిప్పుకుంటాయోమోనని రూ.2 లక్షల దాకా పెట్టుబడి పెట్టా, అయినా ప్రయోజనం లేదు.

టమోటా కూడా రూ.40 వేలకు పైగా పెట్టుబడి పెట్టా. కాపు సరిగా రాలేదు. కాయసైజు చిన్నగా ఉండటంతో బాక్సు రూ.60, రూ.70కి మాత్రమే కొంటున్నారు. రేటు లేకపోవడంతో టమోటా పంటను వదిలేశాం.

రెండు పంటల మీద సుమారు రూ.3 లక్షల దాకా నష్టం వచ్చింది. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

నాణ్యమైన విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్యస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది.

రైతులు పంట నష్టపోతే పొలాల వద్దకు వచ్చి ఎన్యుమరేషన్ చేసే నాథుడే లేడు.

రైతులకు నష్టపరిహారం లేదు, పంటలబీమాను గాలికొదిలేశారు.

నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *