టీడీపీ అధికారంలోకి రాగానే.. ఐటీలో ఏపీని నంబర్ వన్ చేస్తాం

టీడీపీ అధికారంలోకి రాగానే.. ఐటీలో ఏపీని నంబర్ వన్ చేస్తాం

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా.. ఏపీలో ఒక్క సాఫ్ట్ వేర్ కంపెనీ రాలేదు. ఎంతో కష్టపడి చదివి.. డిగ్రీ, పీజీ , ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వారి పరిస్థితి.. ఏపీలో చాలా దయనీయంగా ఉంది. విద్యార్థుల భవితకు దారి చూపాల్సిన.. జగన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏదో ఒక కంపెనీలో.. చేరినా.. జీతం సరిపోక రోడ్డున పడుతున్నారు. దీంతో తమపై ఆధారపడిన కుటుంబాన్ని పోషించుకోలేక.. కొంతమంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఎంతో కష్టపడి చదివి పట్టాలు సాధించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు, ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలు రాక పోవడంతో.. వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఇంత దయనీయ పరిస్థితుల్లో ఏపీ ఉందనేది కాదనలేని సత్యం.

యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం వద్ద.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను.. వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కలిశారు. వారి.. సమస్యలను ఆలకించిన… యువనేత లోకేష్ వారికి భరోసా కల్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పెద్ద ఎత్తున కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని నారా లోకేష్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నిరకాల పరిశ్రమలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబు అంటే అభివృద్ధికి ఒక బ్రాండ్.. ఐటీ అభివృద్ధి అంటే.. హైదరాబాద్ లో చేసి చూపించాం. భవిష్యత్తులో.. ఏపీని.. ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలబెడతామని వెల్లడించారు. టీడీపీ హయాంలో ఐటి కంపెనీలు రాష్ట్రానికి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డామని లోకేష్ తెలిపారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో నారా లోకేష్ మాట్లాడుతూ.. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకను కాదని మీ రాష్ట్రానికి ఎందుకు రావాలని.. ఐటీ కంపెనీలు అడిగాయన్నారు. అందుకే వారికి ఒకటే చెప్పానని.. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఎక్కువ శాతం మంది ఏపి వాళ్ళే ఉన్నారు కాబట్టి, మా రాష్ట్రంలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఈ ఒక్క కారణం చాలని చెప్పేవాడనని.. లోకేష్ తెలిపారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు, రాయితీలు అన్ని వేగంగా ఇవ్వడం వల్లే హెచ్ సిఎల్, జొహో, కాండ్యుయెంట్, పై డేటా సెంటర్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చినట్టు తెలిపారు. టీడీపీ హయాంలో భౌగోళికంగా ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఒక్కో జిల్లాకి సంబంధిత పరిశ్రమలను.. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు. రాయలసీమ ను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా ప్రమోట్ చేసామని.. ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఐటి కంపెనీలను ప్రోత్సహించామని .. లోకేష్ వారికి వివరించారు. భవిష్యత్తుపై ఆందోళన వద్దని.. టీడీపీ అధికారంలోకి రాగానే.. పేరు పొందిన ఐటీ కంపెనీలను తీసుకొచ్చే బాధ్యత తనదని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు లోకేష్ భరోసా కల్పించారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *