కౌలు రైతులకోసం ప్రత్యేక ప్రణాళిక  నారా లోకేష్ వెల్లడి

కౌలు రైతులకోసం ప్రత్యేక ప్రణాళిక నారా లోకేష్ వెల్లడి

టిడిపి అధికారంలోకి రాగానే భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసినట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని గాజులదిన్నెలో అకాలవర్షం కారణంగా దెబ్బతిన్న మునగతోటను లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ రైతు నాగిరెడ్డి లోకేష్ ఎదుట తన సమస్యను విన్నవించుకున్నారు. ప్రకాశం జిల్లా నుండి వచ్చి గాజులదిన్నెలో 5 ఎకరాలు కౌలు కి తీసుకొని మునగ తోట వేసిన రైతు నాగిరెడ్డి.

5 లక్షలు పెట్టుబడి పెట్టాను. అకాల వర్షాలతో చెట్లు మొత్తం పడిపోయాయి, పూత రాలిపోయింది.

విత్తనం, ఎరువులు, పురుగుల మందులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.

5 లక్షలు పెట్టుబడి పెడితే 50 వేలు మాత్రమే వచ్చింది.

గత నాలుగేళ్లుగా పంట నష్ట పరిహారం అందలేదు.

రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్ట పరిహారం అందకపోతే వ్యవసాయం కొనసాగించలేని పరిస్థితి ఉంది.

కౌలు రైతులకు ఎటువంటి సాయం అందడం లేదు

అంటూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రైతు నాగిరెడ్డి వినతిపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.

అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే సిఎం జగన్ కి కనీసం సమీక్ష చేసే ఖాళీ లేదు.

అసలు పంట నష్టం అంచనా కూడా వేసే పరిస్థితి లేదు.

టిడిపి హయాంలో నష్టం అంచనా, పరిహారం సమయానికి అందించాం.

ఉన్న క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసాడు.

విత్తనం దగ్గర నుండి పురుగుల మందుల వరకూ అన్ని రేట్లు జగన్ పాలనలో విపరీతంగా పెరిగిపోయాయి.

అకాల వర్షాలతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఇప్పుడైనా మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకోవాలి.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *