టొమాటో కు మార్కెటింగ్, నిల్వ సౌకర్యం కల్పిస్తాం – రైతులకు నారా లోకేష్ హామీ

టొమాటో కు మార్కెటింగ్, నిల్వ సౌకర్యం కల్పిస్తాం – రైతులకు నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెటింగ్, నిల్వ సౌకర్యం కల్పించి టమోటా రైతులను ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం మాధవరం శివార్లలో మహిళారైతు సిద్దాలింగమ్మ యువనేత లోకేష్ ను కలిసి టమోటా పంటను చూపి గోడు వెళ్లబోసుకున్నారు. తమకు 3ఎకరాల పొలం ఉంటే ఎకరాలో టమోటా, రెండెకరాల్లో చెరకు వేశాను. ఎకరా టమోటా పంటకు రూ.70వేలు ఖర్చయితే 10వేలు రాబడి వచ్చింది. కిలో 6 రూపాయలు పలుకుతోంది. కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను చేలోనే వదిలివేశాను.

గత ఏడాది రెండెకరాల్లో మిర్చి పంట వేస్తే 2.5లక్షల రూపాయల పెట్టుబడి అయింది. వాగువచ్చి పంట కొట్టుకుపోతే ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే రూ.70వేల పంటల బీమా సొమ్ము వచ్చింది. ఏటికేడు నష్టాలతో అప్పులు పెరిగిపోతున్నాయి తప్ప లాభం లేదు.ప్రభుత్వం సాయం అందించకపోతే వ్యవసాయం చేయడం కష్టమని తెలిపింది. సిద్ధాలింగమ్మ సమస్య పై లోకేష్ సానుకూలంగా స్పందించారు. టమోటా రైతులను ఆదుకోవడానికి కెచప్ ఫ్యాక్టరీలు పెడతానన్న జగన్ పత్తా లేకుండా పోయారు.

పంటలబీమాకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి అన్నదాతలను నట్టేట ముంచాడు. రైతులు పంటనష్టపోతే కనీసం పరిశీలించి అంచనావేసే నాథుడే లేడు.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెటింగ్, నిల్వ సౌకర్యం కల్పించి టమోటా రైతులను ఆదుకుంటాం. పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *