పందిపాడు గ్రామంలో నీటి సౌకర్యం కల్పిస్తాం  నారా లోకేష్ హామీ

పందిపాడు గ్రామంలో నీటి సౌకర్యం కల్పిస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే పందిపాడు గ్రామంలో నీటి సదుపాయాన్ని కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.

యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం పాణ్యం నియోజకవర్గం పందిపాడు గ్రామ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.

2019 ఎన్నికల్లో మా గ్రామాన్ని మున్సిపాలిటీలో చేర్చుతామని హామీ ఇచ్చారు.

తాగునీటి సదుపాయం కల్పించి, ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.

మా గ్రామాన్ని 2021లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేశారు.

కానీ నేటికీ తాగునీటి సదుపాయం కల్పించలేదు.

మీరు అధికారంలోకి వచ్చాక మాకు తాగునీటి సమస్యను పరిష్కరించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

జగన్మోహన్ రెడ్డి పాలనలో గుక్కెడు నీరందక ప్రజలు అల్లాడుతున్నారు.

ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు.

విలీనం గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆయా కార్పొరేషన్లదే.కేవలం పన్నుల కోసమే పరిసర గ్రామాలను కలిపేసి, తర్వాత వదిలివేయడం దుర్మార్గం.

ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్తపన్ను, నీటి పన్ను అంటూ రకరకాల పన్నులతో నడ్డివిరుస్తున్నారు అని లోకేష్ విమర్శించారు.

Related post

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
జనగళమై సాగుతోన్న యువగళం.. అలుపెరగని పోరాటం

జనగళమై సాగుతోన్న యువగళం.. అలుపెరగని పోరాటం

లోకేష్ పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణంగా విజయం సాధించింది. లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వంలో వణుకు మొదలైంది. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో…
నారా లోకేష్ యువగళం@200డేస్ రికార్డ్

నారా లోకేష్ యువగళం@200డేస్ రికార్డ్

నారా లోకేష్…ఇప్పుడు ఓ ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే ఆటంబాంబ్. అంతలా రాజకీయాల్లో రాటుదేలిపోయారు. లోకేష్ పేరును అడ్డుపెట్టుకొని ఒకప్పుడు ప్రత్యర్థులు చేసిన రాజకీయం అంతా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *