ఆలువాల వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తాం నారా లోకేష్ హామీ

ఆలువాల వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం వచ్చాక అలువాల వాగువద్ద హైలెవల్ బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా
మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం అలువాల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

మా గ్రామంలో ఉన్న వాగులో వర్షాలు వచ్చినపుడు 1500 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.వాగు లోలెవల్ బ్రిడ్జిలో కంపచెట్లు, ఇతర వ్యర్థపదార్ధాలు ఇరుక్కుపోవడంతో నీళ్లు గ్రామంలోకి వస్తున్నాయి.

దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి.

గతంలో భారీవర్షాల కారణంగా 5గురు ప్రవాహంలో కొట్టుకుపోయారు.

హైలెవల్ బ్రిడ్జి కోసం గత ప్రభుత్వం 2018లో రూ.కోటి మంజూరుచేసింది.

తర్వాత ప్రాసెస్ అయి పనులు మొదలుపెట్టే లోపు ఎన్నికల కోడ్ వచ్చింది.

ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో లో లెవల్ బ్రిడ్జి నిర్మించింది.

దీంతో వర్షం వచ్చినపుడు గ్రామంలోకి నీళ్లు వస్తున్నాయి.

వాగు గట్టువెంట రిటైనింగ్ వాల్, హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులు, బ్రిడ్జిల నిర్వహణను గాలికొదిలేసింది.

పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు.

అలువాల గ్రామస్తుల ఎదుర్కొంటున్న ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *