నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం  పరిశీలనకు నారా లోకేష్ హామీ

నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం పరిశీలనకు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులు, కూలీలకు సౌలభ్యంగా ఉండేలా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం మంత్రాలయం నియోజకవర్గం డి.బెళగల్ గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు.

మా గ్రామానికి 4కిలోమీటర్ల దూరంలో పులికనుమ, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, బసలదొడ్డి ఎత్తిపోతల ఉన్నాయి.మా గ్రామానికి 8కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఉంది.కానీ మా గ్రామానికి తాగు,సాగు నీరు అందడం లేదు.

తుంగభద్ర నుంచి ఎత్తిపోతల ద్వారా మాకు నీరు అందించాలి.

డి.బెళగల్ మండలానికి డిగ్రీ కాలేజి ఏర్పాటు చేయాలి.

మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి.

ఉచిత విద్య, వైద్యం, పంటలకు గిట్టుబాటు ధరలు, మంచి విత్తనాలు అందించాలి.

వైసీపీ ప్రభుత్వం మా గ్రామ నిధులు రూ.35లక్షలు లాక్కుంది. వాటిని తిరిగి ఇప్పించాలి.

నరేగా పథకం పనులకు సంబంచిన కూలీ సొమ్ము గతంలో సకాలంలో వచ్చేవి. నేడు 3నెలలైనా రావడం లేదు.

టిడిపి అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించండి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

సిపి ప్రజాప్రతినిధులకు దోచుకోవడం,దాచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదు.

సమీపంలో నీటి వనరులున్నా తాగునీరు అందని దుస్థితి కల్పించడం బాధాకరం.

గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టులను చేపల పెంపకం కోసం నీళ్లివ్వకుండా రైతుల నోళ్లుగొట్టడం దారుణం.

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో తాగునీటి పథకాన్ని ఏర్పాటుచేసి 24/7 తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం.

గతంలో మాదిరి సబ్సిడీలు, విత్తనాలు అందించి రైతులను ఆదుకుంటాం అని లోకేష్ వెల్లడించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *