ఏడాది ఓపిక పట్టండి .. సబ్సిడీలు పునరుద్ధరిస్తాం  రైతులకు నారా లోకేష్ హామీ

ఏడాది ఓపిక పట్టండి .. సబ్సిడీలు పునరుద్ధరిస్తాం రైతులకు నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం వచ్చాక గతంలో ఇచ్చిన సబ్సిడీలన్నీ పునరుద్దరించి రైతులను ఆదుకుంటాం.

పెట్టుబడులు తగ్గించి వ్యవసాయం లాభసాటి అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

రైతులు అధైర్య పడకుండా ఒక్క ఏడాది ఓపిక పట్టండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం మంత్రాలయం నియోజకవర్గం
డి.బెళగళ్ వద్ద మిర్చిరైతు కర్రియ్యను యువనేత లోకేష్ కలిసి, ఆయన కష్టాలు తెలుసుకున్నారు.

అన్నదమ్ములం కలిసి 5ఎకరాల మిర్చిపంట వేశాం.రూ.10 లక్షల పెట్టుబడి అయితే 2లక్షల దిగుబడి వచ్చింది, నల్లితెగులు వచ్చి పంట నాశనమైంది. కోత కూలీ, పరదాలు, తాలుకాయల ఏరివేతకే రూ.2లక్షల ఖర్చయింది.పండించిన పంటను బళ్లారి తీసుకెళ్లి అమ్ముకోవాల్సి రావడంతో అదనపు భారం పడుతోంది.గతంలో 28రకం
ఎరువుల బస్తా రూ.1100 ఉంటే, ఇప్పుడు రూ.1900 అయింది.గతంలో ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయితే, ఇప్పుడు రెట్టింపు అయింది.పులిమీద పుట్రలా ఇప్పుడు కరెంటోళ్లు వచ్చి మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారు.నిన్న రాత్రికూడా వర్షంపడి నానా అవస్థలు పడ్డాం, పట్టించుకునే నాథుడే లేడు.పరిస్థితులు ఇలాగే ఉంటే కొంతకాలానికి రైతు అనే వాడే ఉండడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

కర్రియ్య సమస్యపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
వ్యవసాయాన్ని పండుగ చేస్తానన్న ముఖ్యమంత్రి అన్నదాతలను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు.

మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నారు.

అకాలవర్షాల కారణంగా పంట నష్టపోతే ఈ ప్రభుత్వం దున్నపోతుపై వాన కురిసినట్లుగా ఉందే తప్ప పట్టించుకోవడం లేదు.

గతంలో మిర్చి రైతులకు పరదాపట్టలు, సబ్సిడీపై పురుగుమందులు అందజేశాం.

ఎవరెంత వత్తిడి తెచ్చినా మోటార్లకు మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దు అని సూచించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *