ఎమ్మిగనూరు లో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు  నారా లోకేష్ హామీ

ఎమ్మిగనూరు లో మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే ఎమ్మిగనూరులో 10వేలమందికి ఉపాధి కల్పించే మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం కోడుమూరు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో చేనేత సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. చేనేత ముడిసరుకులకు
జిఎస్ టి రద్దు చేయాలి.

కర్నూలు జిల్లాలో సిరిసిల్లలో మాదిరిగా మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేయాలి.

కోడుమూరులో తయారుచేసిన చేనేత చీరలకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో గద్వాల వ్యాపారులు వచ్చి తక్కువధరకు కొనుగోలు చేయడంతో కార్మికులు నష్టపోతున్నారు.

కోడుమూరు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి.

కంప్యూటర్ జకాటీలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకుండా ఇబ్బంది పడుతున్నాం. వాటిని రాయితీపై అందించాలి.

గత ప్రభుత్వం పట్టుపై ఇచ్చిన రూ.1000 రాయితీని పునరుద్దరించాలి.

చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని తిరిగి అమలుచేయాలి.

చేనేత కార్మికులకు రాయితీ విద్యుత్ అందించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ చర్యల కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.

ఒక్క ధర్మవరంలోనే 55మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే, ఆ కుటుంబాలను కనీసం పరామర్శించిన పాపాన పోలేదు.

టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా చేనేతలకు రూ.111 కోట్ల రుణమాఫీ చేశాం.

చేనేత కార్మికులు కోరిన విధంగా చేనేత ముడిసరుకు, ఉత్పత్తులపై జిఎస్సీ రద్దుచేస్తాం.

చేనేతల వస్త్రాలకు బ్రాండింగ్ చేసి, జాతీయస్థాయి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.

మగ్గాలున్న చేనేతలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం.

సిల్క్ సబ్సిడీ, ఆరోగ్య బీమాలను పునరుద్దరిస్తాం.

కంప్యూటర్ జకాటీల కొనుగోలుకు రాయితీపై రుణసౌకర్యం కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
జనగళమై సాగుతోన్న యువగళం.. అలుపెరగని పోరాటం

జనగళమై సాగుతోన్న యువగళం.. అలుపెరగని పోరాటం

లోకేష్ పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణంగా విజయం సాధించింది. లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వంలో వణుకు మొదలైంది. యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలో…
నారా లోకేష్ యువగళం@200డేస్ రికార్డ్

నారా లోకేష్ యువగళం@200డేస్ రికార్డ్

నారా లోకేష్…ఇప్పుడు ఓ ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే ఆటంబాంబ్. అంతలా రాజకీయాల్లో రాటుదేలిపోయారు. లోకేష్ పేరును అడ్డుపెట్టుకొని ఒకప్పుడు ప్రత్యర్థులు చేసిన రాజకీయం అంతా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *