జాబ్ కేలండర్.. ఉద్యోగాల భర్తీ యువతకు నారా లోకేష్ హామీ

జాబ్ కేలండర్.. ఉద్యోగాల భర్తీ యువతకు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే యేటా జాబ్ కేలండర్ ను జనవరిలో విడుదల చేసి, ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం కర్నూలు 48వ డివిజన్ ప్రకాష్ నగర్ లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ సబ్ ప్లాన్ ను నిధులను మాకు మాత్రమే ఖర్చుచేయాలి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రుణాలు అందించాలి. ప్రైవేట్, అన్ ఎయిడెడ్, డిగ్రీ కాలేజీల్లో టైమ్ స్కేల్ తో పాటు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ బ్లాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి.

విపత్తుల సమయంలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లకు భృతి అందించాలి. ప్రతి ప్రైవేటు ఉద్యోగికి ప్రభుత్వమే ఆరోగ్య పథకాలు, బీమా సౌకర్యం కల్పించాలి. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉంటున్న యువత జీవితాల్లో మార్పులు తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్సీలను మాత్రమే ఇంఛార్జ్ లుగా నియమించి, అగ్రవర్ణాల పెత్తనం లేకుండా చేయాలి. పెన్షన్ తీసుకునే ఉద్యోగులకు సరైన సమయంలో పెన్షన్ రావడం లేదు. మా వార్డులో శుభకార్యాలయాలు చేసుకోవడానికి కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.33,504 కోట్లు దారి మళ్లించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి, కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు వంటి వాటి కొనుగోలు మేము సహకరిస్తే.. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఒక్క రుణం కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు గతంలో భర్తీ చేశాం.. మళ్లీ భర్తీ చేస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగిత యేటా పెరుగుతోంది. పరిశ్రమలు తీసుకొస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం అని లోకేష్ హామీ ఇచ్చారు

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *