ఎస్సీ సంక్షేమ పధకాలన్నీ పునరుద్ధరిస్తాం  నారా లోకేష్ హామీ

ఎస్సీ సంక్షేమ పధకాలన్నీ పునరుద్ధరిస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం అదోని డివిజన్ మాలమహానాడు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా వారు పలు సమస్యలపై లోకేష్ కు వినతిపత్రం అందజేశారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి.అదోని అంబేద్కర్ నగర్ సర్వే నెం. 420,422ఎ లోని షేర్ ఖాన్ వారి స్థలంలో పేద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ప్రజలు 45సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.టిడిపి ప్రభుత్వం వచ్చాక ఈ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలుచేసి పేదప్రజలకు పట్టాలు ఇవ్వాలి.

మహిళలకు మరుగుదొడ్లు, బీరప్పకొండపై విద్యుత్, రోడ్డు, లైబ్రరీ, కమ్యూనిటీ హాలు నిర్మించాలి.

ఎస్సీల కులాంతర వివాహాలకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది.

దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించాలి.

ప్రైవేటురంగంలో ఎస్సీ రిజర్వేషన్ అమలుచేయాలి, సబ్ ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే ఖర్చుచేయాలి.

దళితులపై దాడులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి.

కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు తీరని ద్రోహం చేసింది.

ఎస్సీల సక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.28వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి.

వైసిపి అరాచకాలను ప్రశ్నించిన దళితులపై దాడులు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయి.

దళితులను హతమార్చిన, వేధింపులకు గురిచేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం.

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దళితుల సంక్షేమం, అభివృద్ధికే కేటాయిస్తాం.

ఆదోని అంబేద్కర్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *