త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం  నారా లోకేష్ హామీ

త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి వచ్చా వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం
పాదయాత్రలో భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గం ఎ.గోకులపాడు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.

మా గ్రామంలో ఫ్లోరైడ్ సమస్య నెలకొనడంతో జనం రోగాల బారిన పడుతున్నారు.

బీసీ,ఎస్సీ కాలనీల్లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకు నిర్మించాలి.

టీడీపీ హయాంలో ఎంపీయూపీ స్కూల్ సగం పనులు జరిగాయి. వైసీపీ వచ్చాక పనులు నిలిపివేశారు.

పెద్దపాడు నుండి పర్లకు గత ప్రభుత్వంలో మెటల్ రోడ్డు మంజూరైంది. వైసీపీ వచ్చాక దాన్ని నిలిపేశారు.

ఓసీ, బీసీ, ఎస్సీలకు శ్మశానవాటికలు మంజూరు చేయాలి.

ఇంటిబిల్లులు పెండింగ్ లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు.

మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేకుండా చేశారు.

గత ప్రభుత్వం నేను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్ల వేశాను.

గోకులపాడులో నిలిచిపోయిన ఎంపీయూపీ స్కూల్, మెటల్ రోడ్డు, డ్రైనేజి, హౌసింగ్ బిల్లులు, పశువుల ఆసుపత్రి సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *