మల్టీసర్వీస్ కేంద్రాలుగా రేషన్ షాపులు  పరిశీలనకు నారా లోకేష్ హామీ

మల్టీసర్వీస్ కేంద్రాలుగా రేషన్ షాపులు పరిశీలనకు నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి వచ్చాక ఎండియు వ్యవస్థను సమీక్షించి, ప్రజలు, డీలర్లకు సౌలభ్యంగా ఉండేలే సముచితమైన నిర్ణయం తీసుకుంటాం.

రేషన్ షాపులను మల్టీసర్వీస్ కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలిస్తాం అని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు.

యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గం పెదపాడులో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలో 29,500 మంది రేషన్ డీలర్లు దశాబ్దాలుగా ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారు.

రాష్ట్రంలో ఆహారభద్రత చట్టానికి విరుద్దంగా రేషన్ డీలర్ల వ్యవస్థకు సమాంతరంగా ఎండియు (రేషన్ బళ్లు) ప్రవేశపెట్టారు. చట్టవ్యతిరేకంగా ఉన్న ఎండియు వ్యవస్థను రద్దుచేయాలి.

2019లో గత ప్రభుత్వం డీలర్ల సంక్షేమానికి కల్పించిన పథకాలు అమలు చేయడం లేదు.

జి.ఓ.నెం.5 ప్రకారం డీలర్లను కార్మికులుగా గుర్తించే అవకాశం ఉన్నా అమలుచేయడం లేదు.

డీలర్ షాపు నిర్వహణ ఖర్చులు పోను గ్రామీణ ప్రాంతాల్లో రూ.18,500, పట్టణ ప్రాంతాల్లో రూ.22,500 ఇచ్చి రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలి.

సరుకులు పంపిణీ చేసినందుకు గాను ఎండియులకు ఆథరైజేషన్ ఇచ్చి, రూ.21వేల జీతం ఇస్తున్నారు. అవే నిబంధనలు రేషన్ డీలర్లకు వర్తింపజేసి, గౌరవవేతనం ఇప్పించాలి.

రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.

రేషన్ షాపులను మల్టీపర్పస్ గా తీర్చిదిద్ది బ్యాంకు కరస్పాండెంట్, మీ-సేవ కేంద్రాల నిర్వహణకు అవకాశం కల్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఏ స్కీమ్ పెట్టినా దానివెనుక ఏదో ఒక స్కామ్ దాగి ఉంటోంది.

కేవలం కమీషన్ల కోసం ఎండియు వాహనాల కొనుగోలుకు రూ.536కోట్లు, ఆపరేటర్లకు జీతాలుగా ఏటా రూ.250 కోట్లు దుర్వినియోగం చేశారు.

డీలర్లు రేషన్ ఇచ్చేటప్పుడు పనులకు వెళ్లే పేదలు ఖాళీగా ఉన్నపుడు వెళ్లి రేషన్ తెచ్చుకునే అవకాశం ఉండేది.

జగన్ తుగ్ల చర్య కారణంగా పనులు మానుకొని మరీ రేషన్ వాహనం కోసం ఎదురచూసే పరిస్థితులు కల్పించారు.

ఒకవైపు ప్రజలు, మరొకవైపు డీలర్లు, ఇంకోవైపు ఎండియు ఆపరేటర్లు ఈ కొత్త విధానం వల్ల ఇబ్బంది పడుతున్నారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *