పెండింగ్ ఇంటి బిల్లులు అన్నీ చెల్లిస్తాం నారా లోకేష్ హామీ

పెండింగ్ ఇంటి బిల్లులు అన్నీ చెల్లిస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్న ఇళ్ల బిల్లలన్నీ చెల్లిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురం గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. పక్కా ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు ఇవ్వకుండా వైసిపి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆర్ డిఎస్ కుడికాల్వను మా గ్రామానికి విస్తరించి సాగు, తాగునీటి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక మా ప్రాతానికి ఆర్ డిఎస్ కాల్వ రాకుండా అడ్డుపడ్డారు. గతంలో గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో మా పొలాలకు నీరందేది. ఇప్పుడు ఆ నీటిని కూడా రాకుండా చేశారు.

మాధవరం మండలంతోపాటు మా గ్రామ సాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్ డిఎస్ కుడికాల్వను విస్తరించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రజలెవరూ ప్రశాంతంగా జీవించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. 30లక్షల ఇళ్లు కడతానని చెప్పి నాలుగేళ్లలో 5 ఇళ్లు మాత్రమే కట్టిన దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ ఇతర పథకాలకు మళ్లిస్తున్నారు.

ఆర్ డిఎస్ కాల్వను విస్తరించి ఇబ్రహీంపురం గ్రామస్తులు తాగు, సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *