నిరుద్యోగ యువత వలసలు నివారిస్తాం  నారా లోకేష్ హామీ

నిరుద్యోగ యువత వలసలు నివారిస్తాం నారా లోకేష్ హామీ

టిడిపి అధికారంలోకి రాగానే పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువత వలసలను నివారిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రసందర్భంగా మంగళవారం ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 1996లో మా గ్రామం వరదల్లో మునిగిపోయింది.

గ్రామాన్నివదిలి వేరే ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నాం.

ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదు. అప్పులుచేసి ఇళ్లు కట్టుకుంటున్నాం.

మీరు అధికారంలోకి వచ్చాక మాకు పెండింగ్ బిల్లులుఇప్పించాలి.

మా ఇళ్లమీదుగా హైటెన్షన్ కరెంటు వైర్లు వెళ్తున్నాయి. వాటివల్ల గతంలో ఇద్దరు చనిపోయారు.

ఆ వైర్లను తొలగించి మా ప్రాణాలు కాపాడాలి.

మా గ్రామదేవత మాన్యం భూమిని కొంత మందిఆక్రమించుకున్నారు.

మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.

మా గ్రామానికి పొలిమేర హద్దులు, సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి.

ఉద్యోగాలు లేక మా గ్రామస్తులు ఇతర వలసలువెళ్లిపోతున్నారు. మీరు వచ్చాక ఉద్యోగాలు కల్పించండి.

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు.

కల్తీ విత్తనాలు, ఎరువులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని వారు లోకేష్ దృష్టికితీసుకెళ్లారు.

వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అన్న చందంగా తయారైంది.

రెండేళ్లలో 30లక్షల ఇళ్లుకడతామని ఆర్భాటంగా చెప్పిన జగన్, కట్టింది 55ఇళ్లు మాత్రమేనని ఇటీవల కేంద్రం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పేదవాడి సెంటు పట్టాలో సైతం జగన్ రెడ్డి రూ.7వేల కోట్లు కొట్టేశారు.

టిడిపిఅధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న పక్కా ఇళ్ల బిల్లులు చెల్లిస్తాం.

పుట్టపాశం గ్రామానికి సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తాం.

హైటెన్షన్ వైర్లను ఇళ్లపైనుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం.

పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *