హిజ్రాల పెన్షన్ లు పునరుద్ధరిస్తాం నారా లోకేష్ హామీ

హిజ్రాల పెన్షన్ లు పునరుద్ధరిస్తాం నారా లోకేష్ హామీ

టీడీపీ అధికారంలోకి వచ్చాక హిజ్రాలకు పెన్షన్లను పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం తాడిపత్రి నియోజక్వర్గం లోని పెదపప్పూరు గ్రామంలో హిజ్రాలు లోకేష్ ను కలిసి వారి సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. హిజ్రాలకు వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన సంక్షేమ పథకాలన్నీ పునఃప్రారంభిస్తామని లోకేష్ చెప్పారు. హిజ్రాల సమస్యల్ని దేశంలో మొదటిసారిగా గుర్తించి పెన్షన్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని లోకేష్ వెల్లడించారు.

2018 జనవరిలో జీఓఎంఎస్-7 ద్వారా రాష్ట్రంలోని సుమారు 30వేల మంది హిజ్రాలకు పెన్షన్లు మంజూరు చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్ర బడ్జెట్లో హిజ్రాల సంక్షేమం కోసం రూ.20కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇళ్ల స్థలం, సొంత ఇళ్లు లేనివారికి తప్పకుండా ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని, స్వయం ఉపాధిని కోరుకునే హిజ్రాలను ప్రోత్సహిస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *