మాదిగల సామాజిక న్యాయానికి టిడిపి కట్టుబడి వుంటుంది  నారా లోకేష్ హామీ

మాదిగల సామాజిక న్యాయానికి టిడిపి కట్టుబడి వుంటుంది నారా లోకేష్ హామీ

మాదిగల సామాజికవ న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి వుంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు యువనేతను కలసి సమస్యలు విన్నవించారు. ఎస్సీల్లోని 59 ఉపకులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 15శాతం రిజర్వేషన్ కల్పించారు.

రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు అందాలన్న ఉద్దేశంతో ఎంఆర్ పిఎస్ విజ్జప్తిమేరకు టిడిపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుచేసింది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి మాదిగలకు కేవలం 20వేల ఉద్యోగాలు మాత్రమే రాగా, వర్గీకరణ తర్వాత 25వేల ఉద్యోగాలు వచ్చాయి.

2004 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొంతమంది స్వార్థపరులతో చేతులు కలిపి సుప్రీంకోర్టుకు వెళ్లి వర్గీకరణను అడ్డుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను నిలిపివేసింది.

ఎస్సీ వర్గకరణకు చర్యలు తీసుకోవాలి, సబ్సిడీ రుణాలపై మా తరపున పోరాడండి అని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.

వారి విజ్ఞప్తులపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ రూ.28వేల కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించడమేగాక, ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసింది.

గతంలో ఎన్ఎస్ఎఫ్ డిసి ద్వారా ఎస్సీ యువతకు వివిధ రకాల వాహనాలను సబ్సిడీపై అందించాం.

వైసిపి ప్రభుత్వం వచ్చాక గతంలో ఎస్సీల సంక్షేమం కోసం

అమలుచేసిన 27పథకాలను రద్దుచేసింది.

ఎస్సీ సంక్షేమపథకాల రద్దు, సబ్ ప్లాన్ నిధులపై అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశాం అని లోకేష్ చెప్పారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *