వైసిపికి మద్దతు ఇవ్వలేదని షాపు కూల్చేశారు! లోకేష్ ఎదుట ఓ బాధితుడు ఆవేదన

వైసిపికి మద్దతు ఇవ్వలేదని షాపు కూల్చేశారు! లోకేష్ ఎదుట ఓ బాధితుడు ఆవేదన

వైసిపికి మద్దతు ఇవ్వలేదని షాపు కూల్చేశారు!

లోకేష్ ఎదుట ఓ బాధితుడు ఆవేదన

అధికారపార్టీ తొత్తులుగా పనిచేసే పోలీసులకు అరదండాలు తప్పవు

పంచాయితీ ఎన్నికల్లో వైసిపికి మద్దతు ఇవ్వలేదని 20ఏళ్లుగా నడుపుకుంటున్న నా కిరాణా షాపును వైసిపి నాయకుల వత్తిడితో అధికారులు కూల్చేశారని కొండపి నియోజకవర్గం మూలెవారిపాలెంకు చెందిన మోరబోయిన మాల్యాద్రి ఆవేదన వ్యక్తంచేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మాల్యాద్రి సోమవారం లోకేష్ ను కలిసి తమ ఆవేదనను తెలియజేస్తూ… మా గ్రామంలోని గ్రామకంఠం సర్వే నంబర్ 769లో 20ఏళ్లుగా నేను కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను.

నేను బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని. గత పంచాయితీ ఎన్నికల్లో నన్ను వైసిపివారు సపోర్ట్ చేయాలని అడిగితే, నేను నిరాకరించాను. దీంతో వైసిపి నాయకుల వత్తిడితో పోలీసులు, రెవెన్యూ అధికారులు జేసీబీని తెచ్చి నా షాపును సరుకుతో సహా కూల్చేశారు. షాపులోని సరుకులు వేరొకచోటుకు మార్చుకునేందుకు 2రోజుల సమయం ఇవ్వాలని అడిగినా కనికరించలేదు. దీంతో నేను రూ.4లక్షలు వరకు నష్టపోయాను. ఆ తర్వాత బతుకుదెరువు కోసం కనిగిరి ప్రాంతానికి వలసవెళ్లానని ఆవేదన చెందాడు.

నారా లోకేష్ స్పందిస్తూ…

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తాలిబాన్ తరహా పాలన కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయడం చేతగాని జగన్… బుల్డోజర్లతో పాలన సాగిస్తున్నాడు. బలహీనవర్గాలపై జగన్ కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఇటువంటి అరాచకాలు చూసిన తర్వాతే బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించాం. బిసిలపై వేధింపులకు పాల్పడిన ఎవరినీ వదలం. మాల్యాద్రి కుటుంబాన్ని వేధించిన వైసిపి నాయకులు, అధికారులను కఠినంగా శిక్షిస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా వైసిపి నేతల వత్తిడితో అడ్డగోలుగా పనిచేసే పోలీసు అధికారులపై ప్రత్యేక విచారణ జరిపి, ఉద్యోగాల నుంచి తొలగించడమేగాక జైలుకు పంపుతాం. మాల్యాద్రి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *