
ఎమ్మెల్సీగా.. ఏపీ ప్రజలకు విశేష సేవలందించిన నారా లోకేష్
- Ap political StoryNewsPolitics
- March 28, 2023
- No Comment
- 33
2017లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే కేబినెట్ మంత్రిగా అభివృద్ధి కి కొత్త భాష్యం చెప్పారు. ఐటి, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండవ సంవత్సరమే సెల్ ఫోన్ ల తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. ఐటి రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనా పథకాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేశారు. గ్రామీణ నీటి సరఫరా లో నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పటం ద్వారా పల్లెవాసుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. గ్రామీణ రోడ్లను కాంక్రీటు తో నిర్మించటం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా 22 వేల 283 కిలోమీటర్ల పొడవున బిటి రోడ్లను మెరుగు పరచి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. మరో 4 వేల 286 కిలోమీటర్ల పొడవున నూతన రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.
అదేవిధంగా పల్లేసీమలు ఎప్పుడూ పచ్చగా ఉంచేందుకై లోకేష్ మంత్రిగా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. 12 వేల 918 గ్రామాలలో పల్లె వనాలు పెంచటం ద్వారా వాటిని హరితమయం చేశారు. గ్రామాలలో విద్యుత్ ను పొదుపు చేయటంతో పాటు వెలుగులు విరజిమ్మే విధంగా చంద్రకాంతి పథకం ద్వారా ఎల్ ఈ డి బల్బులను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. గ్రామాలలో భూగర్భ నీటి పారుదల పథకాలకు పెద్దపీట వేశారు. పారిశుధ్యం మెరుగు పరచేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా పథకాలను అమలు జరిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. యువనేస్తం పథకం ద్వారా దాదాపు 5 లక్షలమంది ఉద్యోగాలు కల్పించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థంగా అమలు జరిపారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలయిన మొదటి పది జిల్లాలలో 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లోనివే కావటం లోకేష్ సమర్ధతను నిదర్శనం గా చెప్పవచ్చు.
చైనా లో జరిగిన ఎకనామిక్ ఫోరం సదస్సుకు లోకేష్ హాజరయ్యారు. దావోస్, అమెరికా లలో ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో లు నిర్వహించారు. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కోయంబత్తూరు, చెన్నై వంటి నగరాలలో పర్యటించి పెట్టుబడిదారులను ఆకర్షించారు. చంద్రబాబు పారదర్శక పాలన, లోకేష్ కృషి ఫలితంగా పలుకంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. విశాఖ, అమరావతి, తిరుపతి లలో ఐటి క్లస్టర్ లను ఏర్పాటు కు శ్రీకారం చుట్టారు. విశాఖలో ఐటి సెజ్ ఏర్పాటు చేసి ఒకేరోజు 21 కంపెనీలను ప్రారంభించటం అప్పట్లో ఒక చరిత్ర. మంత్రిగా పదవీ కాలం పూర్తయి ప్రభుత్వం మారినప్పటికీ లోకేష్ తాను నమ్మిన బాట వీడలేదు. నియంతృత్వ పోకడలతో వున్న ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం జరుపుతున్నారు.