రాప్తాడు నియోజకవర్గంలో నారా లోకేష్

రాప్తాడు నియోజకవర్గంలో నారా లోకేష్

అనంతపురం రాప్తాడు నియోజకవర్గం పైదిండి బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. శ్రీలక్ష్మి నరసింహ స్వామి కొలువైన ప్రాంతం రాప్తాడు అని.. పెన్నా నది రాష్ట్రంలోకి ప్రవేశించే పవిత్ర ప్రాంతం ఇదని.. బంగారు గనులు, బంగారం లాంటి మనుషులు ఉన్న ప్రాంతం రాప్తాడని లోకేష్ తెలిపారు. భూస్వాముల ఆధీనంలో ఉన్న భూములను పరిటాల శ్రీరాములు పేదలకు పంచారని.. ఫ్యాక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించారని లోకేష్ అన్నారు. పరిటాల రవీంద్రను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దింది రాప్తాడు ప్రాంతమని.. ఎంతో చరిత్ర ఉన్న రాప్తాడు లో పాదయాత్ర చెయ్యడం అదృష్టం గా భావిస్తున్నానని లోకేష్ అన్నారు.

రాష్ట్రంలో వైఎస్ జగన్ ది పరదాల యాత్ర… మీ లోకేష్ ది ప్రజా యాత్రని .. ఏ తప్పూ చెయ్యలేదు కాబట్టే నేను ధైర్యంగా కాలర్ ఎగరేసి తిరుగుతున్నానని తెలిపారు. తప్పుడు మార్గంలో జగన్ వెళ్తున్నాడు కాబట్టే ముప్పై కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ లో వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు. యువగళం దెబ్బకి జగన్ వారానికో సారి ఢిల్లీ పరిగెడుతున్నాడని.. నా వెంట్రుక కూడా పీకలేరని జగన్ అన్నాడని.. సింహం సింగిల్ గా వస్తుందన్న జగన్.. ఇప్పుడు అయ్యా .. అందరూ విడివిడి గా పోటీచేయ్యండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఇది యూత్ పవర్ అని లోకేష్ తెలిపారు. అధికారమదంతో మాట్లాడిన జగన్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రజలు గుండు కొట్టారన్నారు. నా పాదయాత్రను అడ్డుకోవడానికి జగన్ పోలీసుల్ని పంపిన రోజే చెప్పా.. సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని లోకేష్ అన్నారు.

లక్ష కోట్లు ప్రజాధనం దొబ్బి జైలుకి వెళ్ళలేదని .. బాబాయ్ ని చంపిన చరిత్ర తనకు లేదని లోకేష్ చెప్పారు. యువగళం పాదయాత్ర లో తనపై.. ఊరికో కేసు పెట్టుకున్నారని… అంతకు మించి పీకింది ఏమి లేదని లోకేష్ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా .. ఈ గళం ఆగదు ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. పాదయాత్ర లో ముద్దులు పెట్టి ఇప్పుడు పారిపోతా అంటే నేను ఊరుకుంటానా ఇచ్చిన ప్రతి హామీ గుర్తుచేసి రోడ్డు మీద నిలబెడతానని లోకేష్ అన్నారు. సింగడు అద్దంకి వెళ్ళాడు…వచ్చాడు అన్నట్టు ఉంది జగ్గడి ఢిల్లీ యాత్ర అని తెలిపారు. ఢిల్లీకి వెళ్లిన ఒక్క సారి కూడా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేదని.. రాజ్యసభ, లోక్ సభ లో కలిపి 31 మంది ఎంపిలు ఉన్నారని. కేవలం కేసుల కోసం తప్పా.. ప్రత్యేక హోదా గురించి జగన్, ఆయన ఎంపిలు ఏ రోజూ పోరాడలేదని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలు నిల్లు. సొంత ప్రయోజనాలు మాత్రం ఫుల్లు అని తెలిపారు. ఉదయగిరి వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే.. ఆయనేం తగ్గలేదు.. రోడ్డు మీద కుర్చీ వేసుకొని దమ్ముంటే రండి తేల్చుకుందాం అంటూ జగన్ కే సవాల్ విసిరారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు జగన్ పనైపోయింది అని చెప్పడానికి అని లోకేష్ తెలిపారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన జగన్ అందరినీ ముంచేసాడన్నారు. ఈయన అబద్దాలు చాలా స్వీట్ గా చెప్పేస్తాడని.. అందుకే జగన్ ను .. ముద్దుగా అబద్దాల మోహన్ అని పిలుస్తానని లోకేష్ చెప్పారు. జాబ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న రాష్ట్రాన్ని.. అబద్దాల మోహన్.. గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారన్నారు. నేడు ఆఖరికి జగన్ పాలనలో.. తిరుమల వెంకన్న సన్నిధిలో గంజాయి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు వ్యవసాయం మానేసి గంజాయి పొలాల్లో పండిస్తున్నారని.. నిన్నే గురజాల లో వైసిపి నాయకుడి పొలంలో గంజాయి పండిస్తుంటే పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. అబద్దాల మోహన్ ఆంధ్రప్రదేశ్ ని అప్పులప్రదేశ్ గా మార్చేసాడని.. జగన్ పాలనలో అభివృద్ధి నిల్లు…అప్పులు ఫుల్లు అని లోకేష్ తెలిపారు.

చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రానికి కియా, టీసీఎల్, హెచ్సిఎల్ లాంటి పెద్ద సంస్థలు వచ్చాయి. అబద్దాల మోహన్ హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ వచ్చాయి. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి, ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడని లోకేష్ చెప్పారు. ఆయన దగ్గర రెండు బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్ లో 10 రూపాయిలు పడతాయి. అదే బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయిలు జగన్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. జగన్ పాలనలో కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచాడని.. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడని.. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నంబర్1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడని లోకేష్ తెలిపారు. చెత్త పన్ను వేసిన ఘనత జగన్ దే నని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని లోకేష్ చెప్పారు.

రాష్ట్రంలో అబద్ధాల మోహన్ ఎవరినీ వదిలి పెట్టలేదని.. యువత, మహిళలు, రైతులు, కార్యకర్తలు, ఉద్యోగస్తులు అందరినీ మోసం చేసాడని లోకేష్ అన్నారు. జగన్ పాలనలో.. యువత భవిష్యత్తును నాశనం చేసాడని లోకేష్ అన్నారు.నాలుగేళ్ల జగన్ పాలనలో.. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని.. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ చేయలేదన్నారు. ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు.. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడని లోకేష్ తెలిపారు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసిన ఘనత జగన్ దే నన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తామని భరోసా ఇచ్చారు. విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

జగన్ పాలనలో మహిళల్నికూడా మోసం చేశాడని లోకేష్ తెలిపారు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతానని జగన్ చెప్పారని.. ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడన్నారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అని చెప్పి.. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడని తెలిపారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడని లోకేష్ చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం.. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని తెలిపారు.

రైతు రాజ్యం తెస్తానన్న అబద్దాల మోహన్ రైతులు లేని రాజ్యం తెచ్చాడని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3గా మారిందన్నారు. జగన్ పరిపాలన లో పురుగుల మందులు పనిచేయవని.. జగన్ మద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయని లోకేష్ అన్నారు. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడని.. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు..మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించాలని లోకేష్ అన్నారు. మీటర్లు పెడితే.. రాయలసీమ రైతులకు ఉరితాళ్లు అవుతాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ని నిర్వీర్యం చేసింది వైసిపి ప్రభుత్వమేనని లోకేష్ అన్నారు. టిడిపి హయాంలో ఎస్సీ,ఎస్టీ లకు ఉచితంగా, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ అందించాం. కానీ ఇప్పుడు జగన్ డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని నిర్వీర్యం చేసి రాయలసీమ రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశారని లోకేష్ అన్నారు.

జగన్ ప్రభుత్వం వచ్చాక.. ఉద్యోగస్తులను వదిలిపెట్టలేదని.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా నని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదని లోకేష్ తెలిపారు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడని.. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారని లోకేష్ చెప్పారు. బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడని.. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని లోకేష్ తెలిపారు. . రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడని.. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని లోకేష్ అన్నారు.

దళితుల పై వైసిపి పాలనలో దమనకాండ కొనసాగుతూనే ఉందని.. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలై.. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చిందని లోకేష్ అన్నారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? అని లోకేష్ ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారని..వైసిపి పాలనలో దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారని లోకేష్ అన్నారు. జగన్ తాను.. రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడని.. కానీ.. ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ అని లోకేష్ అన్నారు.

అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించిందని.. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని లోకేష్ అన్నారు. అన్నమయ్య గేట్లు మరమత్తు కూడా జగన్ మర్చిపోయాడని.. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారని లోకేష్ అన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు అయితే.. జగన్ తన 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమేనని తెలిపారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని లోకేష్ తెలిపారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *