అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు లోకేష్ పరామర్శ

అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు లోకేష్ పరామర్శ

ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మిర్చి కళ్ళంలోకి వెళ్లి రైతులు భీమయ్య, నాగేంద్ర, రైతు కూలీలతో యువనేత లోకేష్ మాట్లాడారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని లోకేష్ వద్ద మిర్చి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం పంట నష్టం అంచనా వెయ్యడానికి కూడా ఎవరూ రాలేదని రైతులు వాపోయారు. విత్తనం వేసిన దగ్గర నుండి పంట తీసే వరకూ ఎకరానికి రెండు లక్షల ఖర్చు వస్తుంది. వైసిపి ప్రభుత్వ వచ్చిన తరువాత విత్తనం, ఎరువులు, పురుగుల మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. విత్తనం ప్యాకెట్ ధర గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రూ.150 వరకూ పెరిగింది, పురుగు మందు డబ్బా రూ.400 పెరిగింది.

నల్ల తామర, గజ్జి ముడత తెగుళ్లతో పంట దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా మారింది. క్వింటా మిర్చి రూ.15 వేలు పలుకుతుంది. తడిసిన మిర్చి క్వింటా రూ.8 వేలు కూడా రావడం లేదు. ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే తప్ప గిట్టుబాటు కాదు. ప్రకృతి సహకరించి క్వింటా రూ.20 వేలు వస్తేనే రైతు కి లాభం వస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీ ధరకే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేయాలి. పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చెయ్యాలి. మిర్చి అమ్ముకోవడానికి గుంటూరు వెళ్లాల్సి వస్తుంది. దీని వలన ట్రాన్స్ పోర్ట్ ఖర్చు పెరిగి తీవ్రంగా నష్టపోతున్నాం. జిల్లాలో మిర్చి యార్డ్ ఏర్పాటు చేయాలని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.

పరదాల సిఎం కి రైతుల కష్టాలు కనపడవు. అవినాష్ రెడ్డి జైలు కి పోకుండా కాపాడటంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అని లోకేష్ విమర్శించారు. అకాల వర్షాల కారణంగా మిర్చి, మామిడి, వరి రైతులు తీవ్రంగా నష్టపోతే పరదాల సిఎం జగన్ కి కనీసం సమీక్ష చేసే ఖాళీ లేదు.పంట నష్టం అంచనా వేసే దిక్కు లేదు. టిడిపి హయాంలో విత్తనాలు, ఎరువులు, మందులు సబ్సిడీ ధరకు అందించాం. మిర్చి రైతులు తరచూ తీవ్రంగా నష్టపోతున్నారు. మిర్చి పంటకు వస్తున్న తెగుళ్లతో పెట్టుబడి వ్యయం రెండితలు పెరిగిపోయింది.

అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి, ఇతర పంటల రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. తడిచి రంగు మారిన మిర్చిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఉదారంగా ఆదుకోవాలి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల మాఫియా రాజ్యమేలుతుంది. రైతు రాజ్యం తెస్తానని పరదాల సిఎం రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీ ధరకు అందజేస్తాం. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు అమ్మే కంపెనీల పై చర్యలు తీసుకుంటాం. ఇక్కడి రైతులు మిర్చి అమ్ముకోవడానికి కర్నాటక, గుంటూరు వెళ్లాల్సి రావడంతో రైతులపై భారం పడుతోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదోనిలో మిర్చి యార్డు, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తాం అని లోకేష్ ప్రకటించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *