బాబాయ్ హత్య జగనాసుర రక్తచరిత్రని తేలిపోయింది.. నారా లోకేష్ వెల్లడి

బాబాయ్ హత్య జగనాసుర రక్తచరిత్రని తేలిపోయింది.. నారా లోకేష్ వెల్లడి

చంపింది అబ్బాయిలేనని చెల్లి రహస్య సాక్ష్యం చెప్పింది
టిడిపి మ్యానిఫెస్టో దెబ్బకు వైసిపి నేతలకు మైండ్ బ్లాంక్
సంక్షేమానికి పుట్టినిల్లు టిడిపి. అమలుచేసి తీరుతాం
పేదవాడ్నంటూ కామెడీ చేస్తున్న జీరో జగన్
ప్రొద్దుటూరును లూటీచేసిన బెట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి
అవినీతికి అడ్డొచ్చిన బిసిలను హతమార్చిన హంతకుడు
ప్రొద్దుటూరు బహిరంగసభలో యువనేత నారా లోకేష్
…….
ఈరోజు ఉమ్మడి కడప జిల్లా ప్రజల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. హూ కిల్డ్ బాబాయ్? సొంత పత్రిక, ఛానల్ ఉందని బాబాయ్ ని లేపేసి గుండెపోటు అన్నారు, నారాసుర రక్తచరిత్ర అని రాసారు. బాబాయ్ ఆత్మ వెంటాడింది. నిజం బయటకి వచ్చింది. అది జగనాసుర రక్త చరిత్ర అని తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ లో గురువారం రాత్రి జరిగిన భారీ బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ అబ్బాయిలే కిల్డ్ బాబాయ్ అని ఏకంగా చెల్లే రహస్యంగా సాక్ష్యం చెప్పింది. కేసు నుండి బయటపడటానికి ఢిల్లీ వెళ్లి అందరి కాళ్లు పట్టుకుంటున్నాడు జగన్.

వివేకా గారిని అత్యంత క్రూరంగా చంపేసిన అబ్బాయిలు దేవుడు వేసే శిక్ష నుండి తప్పించుకోలేరన్నారు. యువగళం. మనగళం. ప్రజాబలం. యువగళం సమస్యల పరిష్కారానికి వేదిక. యువగళం దెబ్బకి వైసిపి ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. ప్రొద్దుటూరులోకి నేను ఎంటర్ అయ్యే వారం రోజుల ముందే ఇక్కడ ఎమ్మెల్యే కి జ్వరం వచ్చింది. ఎంత భయపడ్డాడో తెలుసా? ముందే ప్రెస్ మీట్లు, ఊరంతా ఫ్లెక్సీలై కట్టాడు. అదీ యువగళం సత్తా. మావాళ్లు మీ ఉడత ఊపులకు భయపడే బ్యాచ్ కాదు. అడ్డొస్తే ఉతికి ఆరేసే బ్యాచ్ మాది. కర్రసాము చేస్తూ కామెడీ పీస్ కింద ఎలా పడ్డాడో చూసారు కదా. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసాను. కనీళ్లు తుడుస్తాను. యువగళంలో నేను చూసిన ప్రజల కష్టాలను చంద్రన్నదృష్టికి తీసుకెళ్లాను.

మహానాడులో భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు మన చంద్రన్న అని చెప్పారు. మీ సమస్యలు తెలుసుకున్న తరువాత మీ అన్న చంద్రన్న భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. టిడిపి మ్యానిఫెస్టో దెబ్బకి వైసిపి నాయకుల మైండ్ బ్లాంక్ అయ్యింది. వైసిపి కుక్కలు అన్ని రోడ్ల మీదకి వచ్చి మొరుగుతున్నాయి. హామీలు అన్ని ఎలా అమలు చేస్తారని వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. చరిత్ర తెలుసుకోండి పిల్ల సైకోస్… సంక్షేమానికి పుట్టినిల్లు టిడిపి. సంక్షేమం లో టిడిపి రికార్డులు బ్రేక్ చెయ్యడం మీ తరం కాదు. జగన్ అప్పుల అప్పారావు…చంద్రన్న సంపద సృష్టికర్త. వైసిపి చెత్త పార్టీ…టిడిపి దమ్మున్న పార్టీ. జగన్ ఒక జీరో. మన చంద్రన్న హీరో.
1) మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు.
2) తల్లికి వందనం, ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం అని లోకేష్ వివరించారు.

ప్రొద్దుటూరు పవర్ అదుర్స్

ప్రొద్దుటూరు పేరు చెప్పగానే పౌరుషం గుర్తొస్తుందన్నారు. సీతారాములు నివసించిన పుణ్యభూమి ప్రొద్దుటూరు. కన్యకా పరమేశ్వరి ఆలయం, శోషన్ వల్లి దర్గా, ఆర్సీఎం చర్చి ఉన్న ఆధ్యాత్మిక నేల
ప్రొద్దుటూరు. బంగారం, పత్తి వ్యాపారంలో మిమ్మల్ని కొట్టిన వారు లేరు. అందుకే ప్రొద్దుటూరు ని సెకండ్ ముంబై అని కూడా అంటారు. దసరా ఉత్సవాలు ఇక్కడ అద్భుతంగా నిర్వహించి సెకండ్ మైసూర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంతో చరిత్ర ఉన్న ప్రొద్దుటూరు లో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టమని చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఇరగదీస్తా అన్నాడు. పీకింది ఏమి లేదు. మాయ మాటలు చెబుతూ రాష్ట్రాన్ని జీరో చేసాడు, ప్రజలకు గుండు సున్నా చుట్టాడు. అందుకే జీరో జగన్ అని పేరు పెట్టాను అని లోకేష్ ఎద్దేవా చేశారు. జీరో జగన్ మహిళల్ని మాయ చేసి మోసం చేసాడు.

సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఇప్పుడు జే బ్రాండ్స్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ లాంటి బ్రాండ్లు తెచ్చి మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. జీరో జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే, మీ అన్న చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారు. జీరో జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రైతుల్లేని రాజ్యం తెస్తున్నాడు

జీరో జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు అని లోకేష్ విమర్శించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్ని నకిలీవే. పుండు మీద కారం జల్లినట్టు ఇప్పుడు ఏకంగా మోటార్లకు మీటర్లుపెడుతున్నాడు. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. జీరో జగన్ ఉద్యోగస్తులనువేధించాడు. టీచర్లను లిక్కర్ షాపుల ముందు నిలబెట్టి అవమానించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు.

మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని దుయ్యబట్టారు. జీరో జగన్ పేదవాడ్ని అంటూ కామెడీ చేస్తున్నాడు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా? సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నవాడు పేదవాడా? పేదలు పడుతున్న బాధలు యువగళం లో చూసాను. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదరికం లేని రాష్ట్రం చేస్తామని లోకేష్ వెల్లడించారు.

కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్!

జీరో జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అని లోకేష్ విమర్శించారు. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జీరో జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు.

మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జీరో జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జీరో జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జీరో జగన్ అని చెప్పారు.

బిసిలు, దళితులను మోసగించిన జగన్

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు జీరో జగన్ అని లోకేష్ ఆరోపించారు. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టంతీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. జీరో జగన్ దళిత ద్రోహి. డాక్టర్ సుధాకర్ దగ్గర
మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.

ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై
పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికి శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు. దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసాడు జగన్. టిడిపి గెలిచిన వెంటనే దళితుల 27 సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.

మైనారిటీలను ముంచేసిన జగన్

మైనారిటీలను ముంచేసాడు జీరో జగన్. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు అని లోకేష్ ధ్వజమెత్తారు.ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.ఇప్పటి వరకూ దోషులకు శిక్షపడలేదు. నంద్యాలలో ఆర్టీఓ వేధింపులు తట్టుకోలేక కరిముల్లా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ముగ్గురు పిల్లలతో కరిముల్లా భార్య పడుతున్న బాధలు జగన్ కి
కనపడవు. ఇప్పటి వరకూ దోషులకు శిక్ష పడలేదు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు. పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు.

ఈ కుటుంబాలకు న్యాయం చెయ్యాలి అని పోరాటం చేసింది టీడీపీ. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిని అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించండి. మీరు కోట్లు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. మీకు జగన్ కనీస గౌరవం ఇచ్చాడా? టిడిపి లోనే మీకు గౌరవం దక్కుతుందని చెప్పారు.

బెట్టింగ్ కింగ్ రాచమల్లు అవినీతి లీలలు

2019 ఎన్నికల్లో ప్రొద్దుటూరు ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తాడని రాచమల్లు. శివప్రసాద్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ ఆయన ప్రొద్దుటూరుని గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా,దొంగనోట్లు, ఇసుక అక్రమ రవాణాకి అడ్డాగా మార్చాడు అని లోకేష్ ఆరోపించారు. ఏకంగా సొంత ఇంటినే అసాంఘిక కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మార్చుకున్నాడు. చేసేవి లుచ్చా పనులు పైకిదానకర్ణుడిలా కలరింగ్ ఇస్తున్నాడు రాచమల్లు. శివప్రసాద్ రెడ్డి. అందుకే ఎమ్మెల్యే పేరు మార్చాను ఆయన శివప్రసాద్ కాదు బెట్టింగ్ ప్రసాద్ . నేను పాదయాత్ర కు రాకముందే భయంతో ప్యాంటు
తడుపుకున్నాడు ఈ బెట్టింగ్ ప్రసాద్. జేబులో డబ్బులు లేక బ్రేక్ ఇన్స్పెక్టర్ వేషం వేసుకొని రోడ్ల పై వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేసిన రోజులు మర్చిపోయావా బెట్టింగ్ ప్రసాద్? బెట్టింగ్ ప్రసాద్ ఎంతతింగరోడో తెలుసా అయిపోయిన మ్యాచ్ రీ టెలీకాస్ట్ అవుతుంటే బెట్టింగ్ వేసాడట. ఇంట్లో ఆ సీన్ చూసిన కార్యకర్తలు బయటకు వచ్చి తెగ నవ్వుకున్నారు అంట.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత కారు ఈఎంఐ, అద్దె ఇంట్లో ఉన్న స్థితి నుండి ఇప్పుడు వేల కోట్ల అధిపతి అయ్యాడు బెట్టింగ్ ప్రసాద్. ప్రొద్దుటూరుకు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ఒకరైతే నామినేటెడ్ ఎమ్మెల్యేలు మరో ఇద్దరు. ఆర్బికే… రాచమల్లు, బంగారు రెడ్డి, కిరణ్ రెడ్డి. ఈ ముగ్గురు ప్రొద్దుటూరు ని కేకులా కోసుకొని తినేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడాదికి రూ.500 కోట్లు ఐదేళ్లలో రూ.2500 కోట్లతో ప్రొద్దుటూరు రూపురేఖలు మార్చేస్తా అన్నాడు. ఆయన రూపురేఖలు మారాయి అవినీతి సొమ్ముతో లావు అయ్యాడే తప్ప ప్రొద్దుటూరు రూపురేఖలు మారలేదు. పట్టుమని రూ.100 కోట్ల పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే. టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు తీసుకోవద్దు వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 సెంట్లలో ఒక్క రూపాయి తీసుకోకుండా ఇళ్లు నిర్మించి ఇస్తాం అన్నాడు. ఒకవేళ చెయ్యకపోతే 2024లో పోటిచెయ్యను అన్నాడు. ఇళ్లు కట్టకుండా మీ దగ్గరకు వస్తే తూ నా కొడకా అనండి అన్నాడు బెట్టింగ్ ప్రసాద్ . రూపాయి లేకుండా ఇళ్లు కట్టాడా? మరి ఆయన మాట ప్రకారం తూ నా కొడకా అని ప్రజలు అంటే ఊరుకుంటారా? ప్రొద్దుటూరు మండలం చౌటపల్లి పంచాయతీలో ఉన్న కోట్లు విలువచేసే చర్చి భూములను బినామీ పేర్లతో కొట్టేసాడు బెట్టింగ్ ప్రసాద్ .

బీసీలు అంటే బెట్టింగ్ ప్రసాద్ కి పడదు. అందుకే టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను నడి రోడ్డు మీద తన బావమరిది బంగారు మునిరెడ్డి చేత అత్యంత దారుణంగా హత్య చేయించాడు. టిడిపి ఇంఛార్జ్ డాక్టర్. జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటిపై గుండాలతో దాడి చేయించి బీసీ నాయకుడు మెరువమూర్తి పై దాడి చేయించాడు. బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజిని గారు దొంగ నోట్లు చలామణి చేస్తూ కర్ణాటక లో పట్టుబడ్డారు. దీని వెనుక ఉన్న దొంగనోట్ల డాన్ బెట్టింగ్ ప్రసాద్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దొంగనోట్ల దొంగల్ని పట్టుకుంటాం అని లోకేష్ హెచ్చరించారు.

సెంటుపట్టాలో భారీగా ప్రజాధనం లూటీ

ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం మండలంలో ఓ గౌడౌన్ నిర్వహిస్తున్న వ్యాపారి సెనగ రైతులకు డబ్బులు ఎగ్గొట్టాడు. ఆ గోడౌన్ ను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని, రైతులకు ఒక్రూపాయి ఇవ్వలేదు బెట్టింగ్ ప్రసాద్ అని లోకేష్ ఆరోపించారు. ఆఖరికి మీడియా ప్రతినిధులపై కూడా దాడులు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం బెట్టింగ్ ప్రసాద్ కి ఫ్యాషన్ గా మారిపోయింది.సెంటు స్థలాల భూముల సేకరణలో భారీగా ప్రజాధనం లూటీ చేసాడు బెట్టింగ్ ప్రసాద్ . ప్రొద్దుటూరు టౌన్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఉండటానికి వీలు కానీ చౌడు భూమిని ఎకరా 40 లక్షలకు ప్రభుత్వానికి
అమ్మి భారీగా కమిషన్ కొట్టేసాడు బెట్టింగ్ ప్రసాద్. బోల్లవరం, రామేశ్వరం, మీనాపురం లేఔట్ల సేకరించిన 450 ఎకరాల్లో పెద్ద ఎత్తున స్కామ్ చేసాడు బెట్టింగ్ ప్రసాద్.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే భూ అక్రమాల పై సిట్ వేసి దోచుకున్న డబ్బు కక్కిస్తాం. వాజ్ పేయి నగర్ లో 45 ఏళ్లుగా నివాసం ఉంటున్న 300 కుటుంబాలను రోడ్డుపాలు చేసాడు బెట్టింగ్ ప్రసాద్ . ఇళ్ల నిర్మాణానికి 4 లక్షలు సాయం చేస్తానని చెప్పి అక్కడి స్థలాలు అన్ని బినామీ పేర్లతో కొట్టేసాడు బెట్టింగ్ ప్రసాద్. ఉన్న కూరగాయల మార్కెట్ కూల్చేసి తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేసి ఒక్కో అడుగుకు లక్ష రూపాయిలు వసూలు చేసి కోట్లు దండుకున్నాడు బెట్టింగ్ ప్రసాద్ అని ధ్వజమెత్తారు.

ఏ వ్యాపారం చేయాలన్నా కప్పం కట్టాల్సిందేప్రొద్దుటూరు లో ఏ వ్యాపారం చేసినా ఈ బెట్టింగ్ ప్రసాద్ కి కప్పం కట్టాల్సిందే అని లోకేష్ ఆరోపించారు. ఈయన దెబ్బకి వ్యాపారస్తులు అందరూ వణికిపోతున్నారు. ప్రొద్దుటూరు రెండో ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాద్ బావమరిది బంగారు రెడ్డి అరాచక శక్తిగా మారాడు. అధికారులను బెదిరిస్తున్నాడు. మున్సిపాలిటీలో జరిగే అన్ని పనులకు సింగిల్ టెండర్ వేయించి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాడు. ఎవరైనా భవనం కట్టాలి అన్నా బంగారు రెడ్డికి కప్పం కట్టాల్సిందే.

జమ్మలమడుగు హైవే మీద ఉన్న దళితులకు చెందిన ఎకరా 10 కోట్లు విలువ చేసే భూమి కొట్టేసి వెంచర్ వేసాడు బెట్టింగ్ ప్రసాద్. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కర్ణాటక నుండి అక్రమంగా డీజిల్ తెచ్చి అమ్మడం అన్ని బెట్టింగ్ ప్రసాద్ అనుచరులు చేస్తున్నారు. టిడిపి హయాంలో మున్సిపాలిటీ లో 100 కోట్లు జనరల్ ఫండ్ ఉండేది. ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీ చేసాడు బెట్టింగ్ ప్రసాద్. సొంత కమర్షియల్ కాంప్లెక్ కోసం రోడ్డు విస్తరణ చేసుకున్నారు. ప్రొద్దుటూరు మూడో ఎమ్మెల్యే కిరణ్ రెడ్డి భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రైతులు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నాడు. సబ్ రిజిష్టర్ కార్యాలయంలో ఈయన ఆదేశాలు లేనిదే రిజిస్ట్రేషన్లు జరగవు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో పేద ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం సుందరయ్య కాలనీని ఏర్పాటు చేసింది. అక్కడ భూమిని కబ్జా చేసి వెంచర్ వెయ్యబోతే దళితులు, గిరిజనులు అడ్డుకున్నారు. వారిని కేసులు పెడతాం అని బెదిరించాడు కిరణ్ రెడ్డి. కల్లూరు లింకు కెనాల్ కు సంబంధించి 2.5 ఎకరాలు కోట్ల విలువైన ఇరిగేషన్ భూములను కిరణ్ రెడ్డి అక్రమ వెంచర్లలో కలుపుకున్నారు అని వెల్లడించారు.

ప్రొద్దుటూరును అభివృద్ధి చేసింది టిడిపి

ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసింది టిడిపి అని లోకేష్ తెలిపారు. గ్రామాల్లో సిసి రోడ్లు, పేదలకు టిడ్కో ఇళ్లు, తాగు, సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించింది టిడిపి. టిడిపి అదికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రొద్దుటూరు టౌన్ లో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి అని 150 కోట్లతో మైలవరం జలాశయం నుండి 10 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తే బెట్టింగ్ రెడ్డి అడ్డుకొని ఆలస్యం అయ్యేలా చేసాడు. ఇప్పుడు ఆ పనులు నేనే చేయించా అని బిల్డప్ ఇస్తున్నాడు. మున్సిపాలిటీ కార్యాలయం కట్టింది టిడిపి. పేదలకు 2500 టిడ్కో ఇళ్లు కట్టింది టిడిపి అని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతాం.

చేనేతను నేను దత్తత తీసుకుంటాను. క్లస్టర్లు, టెక్సటైల్ కంపెనీలు తీసుకొస్తాం. గతంలో ఉన్న యార్న్, కలర్ సబ్సిడీ తో సహా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం. శనగ, పత్తి, మినుము రైతులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. ప్రొద్దుటూరు లో జగన్ పాదయాత్ర చేసినప్పుడు పుట్టపర్తి సర్కిల్ లో శివాలయం సాక్షిగా అనేక హామీలు ఇచ్చాడు. ప్రొద్దుటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిచేస్తాం అని చెప్పి ఒక్క రూపాయి కేటయించలేదు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం. కుందు-పెన్నా వరద కాలువను పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చి మర్చిపోయాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కుందు-పెన్నా వరద కాలువను పూర్తి చేస్తాం. చేనేతల కోసం అపెరల్ పార్కు కి పరిశ్రమలు తీసుకొస్తాం అని చెప్పాడు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అక్రమ కేసులు పెట్టినవారిని వదలను

ప్రొద్దుటూరులో ప్రజల పక్షాన నిలబడింది ప్రవీణ్ రెడ్డి అని లోకేష్ ప్రశంసించారు. బెట్టింగ్ రెడ్డి అరాచకాలను ప్రశ్నించినందుకు 29 రోజులు జైల్లో పెట్టి వేధించారు. గతంలోనే ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేసాడు. టిడిపి నాయకులు, కార్యకర్తలను హత్యలు చేసిన వారిని, కేసులు పెట్టి వేధిస్తున్న వారిని వదిలి పెట్టను. ప్రొద్దుటూరు లో ఉన్నా పాకిస్థాన్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. జీరో జగన్ అమ్మ, చెల్లి ని బయటకు గెంటేసాడు.. అమ్మ లాంటి కడపకు అన్యాయం చేసాడు. సాగునీటి ప్రాజక్టులు, పరిశ్రమలు తీసుకొచ్చి ఉమ్మడి కడప జిల్లాని అభివృద్ధి చేసింది టిడిపి.

పులివెందులకు నీళ్లు ఇచ్చిన దమ్మున్న నాయకుడు మన చంద్రన్న. కనీసం పులివెందుల లో బస్ స్టాండ్ కట్టలేని అసమర్ధుడు జగన్. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లు వైసిపి కి ఇచ్చారు. జగన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఉన్న ప్రాజెక్టులు నాశనం చేసాడు. జగన్ నిర్లక్ష్యం వలనే అన్నమయ్య ప్రాజక్టు కొట్టుకుపోయింది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ఆదుకోలేని చెత్త సీఎం జగన్. ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఆలోచించాలి అని కోరుతున్నా. టిడిపి కి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని లోకేష్ వెల్లడించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *