నేను పిల్లిని కాదు…వేటాడేపులిని నారా లోకేష్ హెచ్చరిక

నేను పిల్లిని కాదు…వేటాడేపులిని నారా లోకేష్ హెచ్చరిక

పేదల గొంతుక విన్పించేందుకే యువగళం
రూ.లక్ష కోట్ల సీక్రెట్ ఏమిటో ప్రజలకు చెప్పు
అనగనగా ఒక జగన్నాథం. నిజంగా అనాధేనా?
రజనీకాంత్ చూసి ప్యాంటు తడుపుకుంటున్నారు!
కోడుమూరు బహిరంగసభలో యువనేత లోకేష్

నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. రౌడీ గ్యాంగులు వస్తే ఆగిపోవడానికి ప్యాలస్ పిల్లిని కాదు బ్రదర్ జగన్, నిన్ను వేటాడే పులినని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మంగళవారం సాయంత్రం కోడుమూరులో జరిగిన భారీ బహిరంగసభలో లోకేష్ మాట్లాడుతూ జగన్ కి నేనంటే
భయం. అందుకే నన్ను అడ్డుకోవడానికి రోజుకో గ్యాంగ్ ని పంపుతున్నాడు. యువగళం, మనగళం, ప్రజా బలం.

జగన్ పేదల పాలిట శని. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతుంది అంటున్న జగన్ ఆయన దేశంలోనే ఎక్కువుగా డబ్బున్న సీఎం ఎలా అయ్యాడో చెప్పే దమ్ముందా? లక్ష కోట్లు సంపాదించడానికి సీక్రెట్ ఏంటో జగన్ పేదలకు చెప్పగలడా? ఆయన దేశంలోనే ధనిక సీఎం కానీ ఏపీ ప్రజలు మాత్రం ఎప్పటికీ పేదరికంలోనే ఉండాలని జగన్ కోరుకుంటాడు. అందుకే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అడ్డుక్కునే పరిస్థితికి తీసుకొచ్చాడు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేష్ కోరిక, అందుకే యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను. పేదల గొంతు వినిపించడానికే యువగళం ప్రారంభించానని లోకేష్ చెప్పారు.

కేక పుట్టించిన కోడుమూరు

కోడుమూరు కేక పుట్టించింది. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే జగన్ కి గుండెదడ మొదలవ్వడం ఖాయం అని లోకేష్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన నియోజకవర్గం
కోడుమూరు. దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్య గారు కోడుమూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి గా పనిచేసారు. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయ భాస్కర
రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గానికి చెందిన వారే. సుంకుల పరమేశ్వరి ఆలయం, గోరంట్ల లక్ష్మి మాధవస్వామి దేవాలయం ఉన్న పుణ్య భూమి కోడుమూరు. సుంకేసుల బ్యారేజ్ కి పార్టీ వ్యవస్థాపకులు
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు గారు పూర్తి చేశారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కోడుమూరు నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టమన్నారు.

బాబాయ్ మర్డర్ కేసు రోజుకో మలుపు

బాబాయ్ మర్డర్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతుంది. మర్డర్ అర్ధరాత్రి 2.30 కి జరిగితే తెల్లవారుజామున 4.30 కి లోటస్ పాండ్ మీటింగ్ లో ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులకు గుండెపోటుతో
బాబాయ్ చనిపోయాడు అని చెప్పాడు జగన్. అంటే అప్పటికే కుట్లు వేసి కట్టుకట్టే కార్యక్రమం పూర్తిచేసారు. ఆ మీటింగ్ లో ఉన్న నలుగురిని విచారిస్తే నిజమైన మాస్టర్ మైండ్ దొరికిపోవడం ఖాయం అని
లోకేష్ పేర్కొన్నారు. జగన్ అండ్ కో డ్రామాలు చూసిన తరువాత నాకు ఒక కథ గుర్తొచ్చింది. జగన్నాధం అనే ఒక వ్యక్తి ఒక కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని పోలీసులు జడ్జ్ గారి ముందు
ప్రవేశపెట్టారు. జడ్జ్ గారు ఏమైనా చెప్పుకునేది ఉందా అని జగన్నాధంని అడిగారు. తండ్రి, బాబాయ్ లేని అనాధని దయచేసి నన్ను వదిలిపెట్టండి అని జడ్జ్ గారి ముందు ఏడ్చాడు. జగన్నాధం బాధని చూసి జడ్జ్ గారు కరిగిపోయారు. ఏ పాపం తెలియని అమాయకుడిని, అనాధని ఎలా అరెస్ట్ చేశారయ్యా అని పోలీసుల్ని ప్రశ్నించారు జడ్జ్ గారు. అయ్యా తండ్రి ని బాబాయ్ ని లేపేసింది జగన్నాధమే అని పోలీసులు జడ్జ్ గారితో అన్నారు. అది విన్న జడ్జ్ గారు షాక్ కి గురయ్యారు. జగన్నాధం ఎంత గొప్ప యాక్టరో జడ్జ్ గారికి అర్ధమయ్యిందని లోకేష్ చెప్పారు.

రజనీకాంత్ ను చూసి ప్యాంటు తడుపుకుంటున్నారు

నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం, చంద్రబాబు విజన్ గురించి మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడలేదు.
వైసిపి గురించి అసలే మాట్లాడలేదు. చంద్రబాబు గొప్పతనం గురించి రజినీకాంత్ చెప్పడం చూసి జగన్ టీవీ పగలకొట్టాడు అంట. రజినీకాంత్ ఎప్పుడో చెప్పారు నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం
సింగిల్ గా వస్తుంది అని. ఆయన సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయాడు. వైసిపి వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. అందుకే వైసిపి వాళ్ళు ప్యాంట్లు
తడిపేసుకుంటున్నారు అని లోకేష్ ఎద్దేవా చేశారు.

తండ్రిని పొగిడినా తట్టుకోలేడు

జగన్ ది శాడిస్టు స్వభావం. అతన్ని తప్ప వైఎస్ గారిని పొగిడినా తట్టుకోలేడు. అందుకే పేరు మార్చాను శాడిస్టు జగన్ అని పెట్టాను అని లోకేష్ చెప్పారు. ప్రజల సమస్యలు తీర్చే ప్రజావేదిక కూల్చిన వారిని శాడిస్ట్ అనే అంటాం. ప్రకృతి ని విధ్వంసం చేస్తూ రుషికొండకు గుండు కొట్టిన వాడిని శాడిస్ట్ అనే అంటాం. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఆనంద పడేవాడిని శాడిస్ట్ అనే అంటాం. శాడిస్టు జగన్ పెద్ద ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్. ఆయన ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతాను. శాడిస్టు జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు అని లోకేష్ హెచ్చరించారు.

దమ్ముంటే ఆ స్టిక్కర్లు బిల్లులమీద అంటించు

శాడిస్టు జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి అని లోకేష్ సవాల్ చేశారు. శాడిస్టు జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ శాడిస్టు జగన్. శాడిస్టు జగన్ యువత భవిష్యత్తుని దెబ్బతీశాడు.జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మహిళల తాళిబొట్లు తాకట్టు

శాడిస్టు జగన్ జగన్ మహిళల తాళిబొట్లు తాకట్టు పెడుతున్నాడని లోకేష్ ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? అని ప్రశ్నించారు. సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు
సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. శాడిస్టు జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. శాడిస్టు జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు. శాడిస్టు జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది అని లోకేష్ విమర్శించారు.

బిసిల బ్యాక్ బోన్ విరిచిన శాడిస్ట్ జగన్

బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు శాడిస్టు జగన్. పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్
చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం. బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం. మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఏర్పాటు చేస్తాం. అవి శాశ్వత కుల ధృవ పత్రాలుగా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం.

దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం. శాడిస్ట్ జగన్ దళిత ద్రోహి. డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది. ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు. ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా? సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు. వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు అని ఆరోపించారు.

మైనారిటీలనూ మోసగించాడు

మైనారిటీలను మోసం చేసాడు శాడిస్ట్ జగన్. దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు. మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు అని లోకేష్ చెప్పారు.
ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు. శాడిస్ట్ జగన్ సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు
ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.

పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి,
బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు. టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదన్నారు.

రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ

శాడిస్ట్ జగన్ నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి
అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే. రాయలసీమ రైతులకు
టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు శాడిస్ట్ జగన్. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు. రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

కోడుమూరులో షాడో ఎమ్మెల్యే అరాచకం

కోడుమూరు నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అని లోకేష్ ఆరోపించారు. ఒకరు సుధాకర్. మరొకరు షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి. వీళ్లు నియోజకవర్గాన్ని కేకు ముక్కలా కోసుకొని
భూములు, ఇసుక, ఎర్రమట్టి దోచుకుంటున్నారు. ఇది ఎస్సి రిజర్వ్డ్ నియోజకవర్గం. కానీ ఇక్కడ పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిదే. నియోజకవర్గంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అన్నా షాడో ఎమ్మెల్యే కి 10 శాతం కప్పం కట్టాల్సిందే. కోడుమూరు కొండరాయుడు కొండను వైసిపి ఎర్రమట్టి మాఫియా అడ్డంగా తవ్వేసింది.

తుంగభద్ర నదిలో సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె, సింగవరం, ముడుమాల, పలదొడ్డి గ్రామాల వద్ద ఇసుక రీచులు నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాడు షాడో ఎమ్మెల్యే. ఎమ్మెల్యే సుధాకర్ బంధువు సి. బెళగల్ జడ్పీటీసీ సభ్యుడు గిరిజోన్ ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణాలో సిద్ధహస్తుడు. అంగన్వాడీ ఉద్యోగాలను సైతం ఈ ఎమ్మెల్యే వదలలేదు. ఒక్కొ పోస్టుకు రూ.3-5 లక్షల వరకు వసులు చేశారు. విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టుకు రూ.5 లక్షలు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నియమించాలంటే రూ.2 లక్షలు, ఆశా వర్కరుకు రూ. 1.50 లక్షలు వసులు చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు.

ప్రైవేటు భూములను కూడా వదలడంలేదు

హైదరాబాద్ లో ఉంటున్న నిడ్డూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన 8 ఎకరాల భూమిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి కొట్టేసారు అని లోకేష్ ఆరోపించారు. ఆ భూమి విలువ 7 కోట్లు.
కర్నూలు శివారులో బి.తాండ్రపాడు గంగమ్మ చెరువునే అక్రమించారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఇందులో ఎమ్మెల్యేకి కోట్లల్లో ముడుపులు అందాయని అంటున్నారు. కర్నూలు మండలం తొలిసాపురం గ్రామంలో 90 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి స్కెచ్ వేసారు. ఆ భూమిని వేరే వాళ్లకు అమ్మేయడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసారు.

పసుపుల గ్రామంలో 7 ఎకరాల్లో దళితులు, బీసీ, ముస్లిం మైనార్టీలు 15 ఏళ్లకు పైగా జీవిస్తుంటే.. ప్రైవేటు భూమి అని ఓ వైసీపీ నాయకుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రూ.25 కోట్లు విలువైన భూమి ఇది. ఇందులో ఎమ్మెల్యేకి వాటాలు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక నుండి లిక్కర్ తెచ్చి కోడుమూరు లో అమ్మేస్తున్నారు ఎమ్మెల్యే,షాడో ఎమ్మెల్యే అనుచరులు. జగన్నాథ్ గట్టు మీద జర్నలిస్ట్ లకు ఇచ్చిన కాలనీలో సైతం ఎర్రమట్టి తవ్వేసి, స్థలాలు ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

జగన్ పాదయాత్ర లో కోడుమూరు వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. కోడుమూరు, గోరంట్ల నుంచి కొత్తపల్లి గ్రామాలు కలుపుతూ హంద్రీ నదిపై వంతెన నిర్మాణం చేస్తామని జగన్ పాదయాత్రలో
ఇచ్చిన హామీ ఇప్పటి అమలు కాలేదని లోకేష్ చెప్పారు. అధికారంలోకి రాగానే గుండ్రేవుల జలాశయం నిర్మిస్థానని జగన్ హామీ ఇచ్చాడు. ఆ హామీ గాల్లో కలిసిపోయింది. టిడిపి హయాంలో గుండ్రేవుల
ప్రాజెక్టు కోసం డిపిఆర్ సిద్ధం చేసి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సంబంధించిన జీ. ఓ ను కూడా విడుదల చేయగా ఇప్పటివరకు ఊసే లేదు.

ఈ ప్రాజెక్ట్ పూర్తీ అయితే లక్షన్నర ఎకరాలకు సాగునీరు
అందించవచ్చు. నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ , పాలిటెక్నికల్, ఐటిఐ కాలేజ్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మర్చిపోయారు. గూడూరు నగర పంచాయితీ నందు 200 పడకల
ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేరవేర్చలేదన్నారు.

కోడుమూరును అభివృద్ధి చేసింది టిడిపినే

కోడుమూరు లో గెలవకపోయినా అభివృద్ధి చేసింది టిడిపియేనని లోకేష్ చెప్పారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలు
చేసింది టిడిపి. కోడుమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గాజులదిన్నె జలాశయం నుంచి ప్రత్యేక పైపులైన్ తాగునీరు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కోడుమూరు సహా వివిధ
గ్రామాలకు తాగునీటి కోసం హంద్రీనీవా కాలువ ద్వారా ఒక టీఎంసీ నీటిని కేటాయించిన ఘనత టీడీపీదే. రూ.70 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకానికి టీడీపీ రూపకల్పన చేసింది. జగన్ వచ్చాక ఆ పథకం ఊసే
లేదు. కోడుమూరు మండలం గోరంట్ల – కొత్తపల్లి మధ్య హంద్రీ నదిపై వంతెన నిర్మాణం చేయాలనే ప్రజలు కోరుతున్నారు. కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లో 35 గ్రామాలకు రవాణాకు ఆధారం. శంకుస్థాపన చేసి వదిలేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వంతెన నిర్మాణం చేపడతామని లోకేష్ హామీ ఇచ్చారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు వేస్తాం

కోడుమూరు – గూడూరు పట్టణాలను కలుపుతూ వయా చనుగొండ్ల మీదుగా 10 కి. మీలు ప్రధాన రోడ్డు అధ్వానంగా మారిందని లోకేష్ చెప్పారు. నియోజకవర్గంలో మెజార్టీ గ్రామాల రోడ్లు పరిస్థితి ఇలాగేఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు వేస్తాం. గురురాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా కృష్ణదొడ్డి, సంగాల, కంబదహాల్, చింతమాన్ పల్లె, రేమట ఎత్తిపోతల పథకాలకు జగన్ నిర్వాహణ నిధులుకూడా ఇవ్వలేదు.

రైతులే చందాలు వేసుకొని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ప్రాజెక్టుల మరమత్తులు పూర్తి చేస్తాం. కర్నూలు నుంచి సుంకేసుల వయామునగాలపాడు రోడ్డు ఆధునీకరణకు టీడీపీ ప్రభుత్వం రూ.25 కోట్లతో పనులు ప్రారంభించాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తిచేస్తాం.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. టిడిపి కార్యకర్తలను వేధించిన వైసిపి వాళ్ళను వదిలిపెట్టను వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అని లోకేష్ హెచ్చరించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *