పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్ లతో చంద్రబాబు జైలుపాలైన వేళ…పార్టీ బాధ్యతలన్నీ ఇప్పుడు యువనేత నారాలోకేష్ పై పడ్డాయి. ఇప్పటికే యువగళం పాదయాత్ర ద్వారా తానేంటో నిరూపించుకున్న లోకేష్…ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న పార్టీని గట్టెక్కించేందుకు తన శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తున్నారు.

చంద్రబాబు తర్వాత లోకేశ్ పార్టీలో నెంబర్ టూ గా ఉన్నారు. ఈ సమయంలోనే లోకేశ్ తన సమర్ధతను చాటుకుంటున్నారు. యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్..ఇప్పుడు తండ్రిని బయటకు తీసుకురావడంపై దృష్టిసారించారు. లాయర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే, ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఏ మచ్చలేని చంద్రుడికి అవినీతి మకిలీ అంటించాలనే కుట్రపూరిత రాజకీయాలను… జాతీయ స్థాయిలో ఎండగడుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి జరగలేదని బలంగా మీడియాకు తన వాయిస్ వినిపించారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని జాతీయ పార్టీల నేతలకు వివరించి, వారి మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు, జగన్ సర్కార్ పెట్టిన అక్రమ కేసులు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసి చర్చించనున్నారు. అటు పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం సిద్ధం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించి… చంద్రబాబు అరెస్ట్ పై లోక్ సభలో చర్చ కోసం ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం చేశారు.

 

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని క్షేత్రం

హిందువులకు అత్యంత ముఖ్యమైన ఆరాధ్య దైవం విఘ్నేశ్వరుడు. సకల శుభంకరుడు.. సకల గణాలకు నాయకుడు గణేశుడు. అంతే కాదు.. లయకారుకుడైన ఆదిశంకరుడు, జగన్మాతల ముద్దుబిడ్డ వినాయకుడు. శివుని ఆదేశాలతో…
ఖమ్మంలో కాంగ్రెస్ జోరు..కారు బేజారు

ఖమ్మంలో కాంగ్రెస్ జోరు..కారు బేజారు

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలో బలమైన నేతలు ఇద్దరూ కారు దిగడంతో, ఏమీ పాలుపోని స్థితిలో కేసీఆర్ ఉన్నారు . మాజీ మంత్రి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *