
RDTసేవలు చిరస్మరణీయం
- Ap political StoryNewsPolitics
- April 5, 2023
- No Comment
- 32
అనంతపురం రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ కార్యాలయాన్ని నారా లోకేష్ సందర్శించారు. RDT వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాల వేసి.. నారాలోకేష్ నివాళులర్పించారు. విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ ఆశీస్సులు తీసుకున్నారు. RDT కార్యాలయంలోకి నారా లోకేష్ .. విన్సెంట్ ఫెర్రర్ కుమారుడు మాంచు ఫెర్రర్, ఆయన సతీమణి విశాల ఫెర్రర్ ఆహ్వానించారు. ప్రభుత్వానికి సమాంతరంగా RDTఅందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని లోకేష అన్నారు. 1969లో ఎన్నో అవమానాలు ఎదురైనా.. పేదలకు సేవలు అందించాలనే ధృడ సంకల్పంతో విన్సెంట్ ఫెర్రర్ గారు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నారా లోకేష్ అన్నారు.
ప్రస్తుతం RDT రాయలసీమ వ్యాప్తంగా 3 వేల గ్రామాల్లో సేవలు అందిస్తోంది. ఆసుపత్రుల నిర్మాణం, ఆర్ధిక సహాయం, ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, చెక్ డ్యాంల నిర్మాణం, గ్రామాల్లో తాగునీటి సదుపాయాలు ఇలా అనేక సేవలను RDTఅందిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. వేల కోట్లు ఖర్చు చేసి పేదలకు సేవలు అందించడం గొప్ప విషయమని నారా లోకేష్ అన్నారు. అనంతపురం జిల్లాలో RDTసహాయం పొందని కుటుంబం అంటూ ఉండదంటే.. అతి శయోక్తి కాదని లోకేష్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే RDT సేవలు మరింత విస్తరించే విధంగా కృషి చేస్తామని.. లోకేష్ తెలిపారు.
గ్రామస్థులకు ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కల్పన కోసం ఆర్డిటి సేవలు వినియోగించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని లోకేష్ తెలిపారు. యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పడం ద్వారా.. ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో.. ఉమ్మడి ప్రణాళిక సిద్దం చేసుకొని ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తాని లోకేష్ తెలిపారు.