రాయలసీమలో చరిత్ర సృష్టించిన లోకేష్

రాయలసీమలో చరిత్ర సృష్టించిన లోకేష్

జనగళమే యువగళమై సాగిన నారా లోకేష్ పాదయాత్ర రాయలసీమలో విజయవంతంగా తన తొలి మజిలీని పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో తొలి అడుగు వేసిన లోకేష్… నిర్విరామంగా 125 రోజుల పాటు 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా తన పాదయాత్రను కొనసాగించి చరిత్ర సృష్టించారు . గతంలో పాదయాత్ర చేసిన నేతలెవరూ సీమలో ఇన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు. దాదాపు 1600 కిలోమీటర్ల మేర రాయలసీమలో సాగిన లోకేష్ యువగళం మరో మైలురాయిగా నిలిచింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని ఫారెస్ట్ రేంజ్ 3లో రైతులతో సమావేశంతో రాయలసీమలో లోకేష్ యాత్ర ముగిసినట్లయింది. వెళ్లిన ప్రతీ చోట జనం నీరాజనం పలుకుతూ, జగన్ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని కన్నీరుపెట్టుకున్నారు.

రాయలసీమలో 45 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో లోకేష్ యాత్ర కొనసాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45 రోజులు 577 కిలోమీటర్లు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23 రోజులు 303 కిలోమీటర్లు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40 రోజులు 507 కిలోమీటర్లు, కడప జిల్లాలో 17 రోజులు 200 కిలోమీటర్లకు పైగా కొనసాగింది. వర్షంలో తడుస్తూ, మండుటెండలో కాళ్లకు బొబ్బలొచ్చినా, చేయి నొప్పి కారణంగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు హెచ్చరించినా…లోకేష్ వెనకడుగు వేయలేదు. తెల్లవారు జామునే ప్రారంభమయ్యే ఆయన దినచర్య.. అర్థరాత్రి వరకూ ఉంటోంది. అత్యధిక సమయం జనంలోనే ఉంటున్నారు. రోజుకు వేయి మందికిపైగా సెల్ఫీలు ఇస్తున్నారు. కొన్ని వందల మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు. పార్టీ పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. నడకదారిలో వివిధ తరగతుల ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దళితులు, మైనార్టీలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు…దారిపొడవునా లోకేష్ ను కలుసుకొని జగన్ పాలనలో ఏవిధంగా బాధితులుగా మారామో చెప్పుకొని గోడు వెళ్లబోసుకుంటున్నారు.

కుప్పంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు లోకేష్, ఆయన చుట్టూ ఉండే జనాన్ని తక్కువ అంచనా వేసి…ఆయన మాటల్ని ఎగతాళి చేశారు. రాను రాను పెరుగుతున్న జన సందోహం.. లోకేష్ నిక్కచ్చి మాటలు… రాజకీయాలపై ఆయనకున్న పరిణితి అన్నీ స్పష్టమయ్యే సరికి అందరూ సైలెంట్ అయిపోయారు. పాదయాత్రను అడ్డుకునేందుకు జగన్ బ్యాచ్ చాలా కుట్రలే చేసింది. మైకులు లాక్కోవడం దగ్గర్నుంచి, లోకేష్ జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక కోడిగుడ్లతో దాడికి తెగబడే వరకు వైసీపీ అరాచకాలు కొనసాగాయి. అయినా అన్నింటినీ తట్టుకొని అలుపెరగని యోధుడిగా అహర్నిషలు జనంకోసమే పరితపిస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. ఈ క్రమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. అవమానాలను తట్టుకున్నారు. అరాచక శక్తుల అన్యాయాలను ఎలుగెత్తి చాటారు. తన వెక్కిరించిన నోళ్లకు తాళం వేశారు.

జగన్ నాలుగేళ్ల పాలనలో నవరత్నాల పేరుతో చేసిన మోసాలు, ధరలు బాదుడు, పన్నుల మోత, ఎన్నికల్లో ఇచ్చిన హామీల వాగ్దానభంగం.. ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న విషయాన్ని లోకేష్ ప్రజల ముందుంచి వారిలో చైతన్యం తీసుకొచ్చారు. రాయలసీమలో టీడీపీ హయాంలో ఏవిధమైన అభివృద్ధి జరిగిందో స్పష్టంగా వివరించారు. సెల్ఫీల ద్వారా జగన్ అండ్ కోకు ఛాలెంజ్ లు విసిరారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చాక రాయలసీమకు తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి ‘మిషన్‌ రాయలసీమ’ను ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటామనే భరోసా కల్పించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *