లోకేశ్ రిహార్సిల్స్ ..వ్యూహాత్మకంగా అడుగులు

లోకేశ్ రిహార్సిల్స్ ..వ్యూహాత్మకంగా అడుగులు

ఏపీ రాజకీయాల్లో యువత భాగస్వామ్యంకావాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి లోకేశ్ బాబు పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. చుట్టూ నిత్యం జరుగుతున్న పరిణామాలను చూస్తూ యువత మిన్నకుండిపోకుండా… బాధ్యతగా ప్రశ్నించడం, ప్రజాసమస్యలను పరిష్కరించి సమాజసేవలో భాగస్వామ్యంచేయాలనే సంకల్పంతో ఈ పాదయాత్రచేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయ సంకల్పించిన మంగళగిరి నియోజకవర్గంలో సందడి లోకేశ్ బాబు చేశారు. సాయంత్రం వేళ సరదాగా కాసేపు.. అనుకోని అతిథిలా మంగళగిరి పరిసరాల్లో పర్యటించారు. మంగళగిరిలో ఫ్యామస్ సెంటర్ ఆల్ఫా హోటల్ పరిసరాల్లో కాన్వాయ్ దిగారు. అక్కడి రెస్టారెంట్లో ఇడ్లీ ఆర్డరిచ్చారు.

వేడి వేడి ఇడ్లీ వ‌చ్చేలోపు త‌న టేబుల్ ఎదురుగా ఉన్న ఇద్ద‌రు ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ తో మాట క‌లిపారు. 20 నిమిషాల‌కు పైగానే వారితో ముచ్చటించారు. రాష్ట్రంలో ఐటీకి ప‌రిస్థితి, వారి ఉద్యోగం, స్థితిగ‌తులు, ఉద్యోగావ‌కాశాల‌పై చ‌ర్చ సాగింది. లోకేష్ బాబు అక్క‌డున్నార‌ని సమాచారం అందుకున్న యువ‌కులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. లోకేశ్ బాబుతో సెల్ఫీల సంద‌డి ఆరంభమైంది. ఇడ్లీ తిని వారికి బిల్లు చెల్లించి, టీ స్టాల్ ద‌గ్గ‌ర‌కొచ్చి ఇరానీ టీ తాగారు. య‌జ‌మానుల‌తో మాట‌లు క‌లిపారు.

అల్ఫా హోటల్ సెంటర్లో రోజువారి రాజకీయాలపై చర్చ, ఈ సారి ఎవరు గెలుస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తుందనే విషయాన్ని అక్కడివారు లోకేశ్ బాబుకు చెప్పారు. ఈ సారి జరిగే ఎన్నికల్లో లోకేశ్ బాబే గెలుస్తాడని చర్చించుకునే విషయాన్ని లోకేశ్ బాబుదృష్టికి తెచ్చారు. ఇదే విషయాన్ని అక్కడికి చేరుకున్న యువతకు వివరించి సంతోషం వ్యక్తంచేశారు. ఆల్ఫా సెంట‌ర్లో లోకేష్ సంద‌డి చేస్తున్నార‌ని యువ‌త గుంపులు గుంపులుగా త‌ర‌లివ‌చ్చారు. అదే స‌మ‌యంలోఈ ఏరియాలో ప‌వ‌ర్ క‌ట్ చేశారు. దీని వెనుక ప‌వ‌ర్ ఎవ‌రిదో తెలిసిన నారా లోకేష్ చిరున‌వ్వు న‌వ్వారు. అంత‌లోనే అంద‌రి సెల్‌ఫోన్ల లైట్లూ వెలిగాయి. తాను న‌వ్వుతూ, అంద‌రినీ న‌వ్విస్తూ ఓపిగ్గా సెల్ఫీలు దిగారు. పాన్ షాప్ వారితో మాట‌లు క‌లిపారు. అక్క‌డ సిగ‌రెట్లు పీల్చుతున్న యువ‌త‌తో ఆరోగ్యం పాడు చేసుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇచ్చారు. ఊహించని విధంగా ఆల్ఫహోటల్ సెంటర్లో దిగి…న‌వ్వులు పంచి…యువ‌గ‌ళాల మ‌నోగ‌తాల‌ను ఆల‌కించిన లోకేష్ బాబు వాస్తవాలను తెలుసుకునే ప్రతయ్నం చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎటువైపు మొగ్గుచూపుతారోననే విషయాన్ని లోకేశ్ బాబు క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *