అన్న దిగుతుండు…NBK108 క్రేజీ అప్ డేట్

అన్న దిగుతుండు…NBK108 క్రేజీ అప్ డేట్

నందమూరి నటసింహం బాలకృష్ణ NBK108 చిత్రం గురించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 10న బాలయ్య బర్త్ డేను పురస్కరించుకుని చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతోంది. గతంలో ఎన్నడూ జరుపుకోని విధంగా చేసేందుకు NBK108 టీమ్ ప్లాన్ చేసింది. అన్న దిగుతుండు…అదిరిపోయే అప్‌డేట్లను రెడీ చేస్తున్నాం.

ఆయన రాక కోసం ఆసక్తిని పెంచుకోండి అంటూ NBK108 టీమ్ ట్వీట్ చేసింది.  దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా  పవర్‌ఫుల్‌ టైటిల్‌ను గానీ, గ్లింప్స్‌ కానీ విడుదల చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.

వరుసగా ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ…తాజాగా  అనిల్ రావిపూడితో కలిసి ఓ క్రేజీ మూవీని చేస్తోన్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.  చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. దీన్ని దసరా బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.

ఇప్పటి వరకూ చూడని బాలయ్యని ఈ చిత్రంలో చూడబోతున్నారని ఫస్ట్‌ లుక్‌ విడుదల సమయంలోనే అనిల్ రావిపూడి చెప్పారు. తాజా పోస్ట్‌తో ఆ అంచనాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. కాజల్‌ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో శ్రీలీల ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్‌స్ర్కీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘భగవత్ కేసరి’ టైటిల్‌ను దాదాపుగా ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *