
బాలయ్య #108 ఫస్ట్ లుక్ అదిరే..
- EntertainmentMoviesNews
- March 23, 2023
- No Comment
- 38
టాలీవుడ్ లో ఇప్పటివరకు పలు సినిమాలలో నటించి అగ్రపథంలో హీరో నందమూరి బాలకృష్ణ దూసుకెళ్తున్నారు. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.2023 ఏడాది మొదట్లో వీర సింహారెడ్డి సినిమా గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు బాలయ్య అనీల్ రావిపూడి డైరెక్షన్లో 108 వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బాలయ్య 108వ చిత్రంలో సరికొత్త అవతారంతో కనిపించబోతున్నారు.ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా బాలయ్య కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తోంది. ఇటీవలే ఆమె ఈ సినిమాలో జాయిన్ అయినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది చిత్ర యూనిట్.ఉగాది కానుకగా బ్లాస్టింగ్ లాంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టర్ లలో బాలయ్య ఊహించని అవతార్స్ లో కనిపిస్తున్నారని చెప్పాలి. NBK 108 నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఉగాది సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ను బాలయ్య ఇచ్చినట్లైంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ పై దిస్ టైమ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే లైన్ రాసి ఉంది. బాలయ్యను ఇంతకు ముందెన్నడు చూపించని విధంగా చూసించబోతున్నానని డైరెక్టర్ చెప్పినట్లుంది. మీ ఊహలకు మించి సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ పోస్టర్ లో బాలయ్యసీరియస్ లుక్ లో నిల్చొని మెలేసిన మీసంతో మేడలో కండువా చుట్టుకొని ఉన్నారు. మరో పోస్టర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా చూస్తున్నట్టు ఉంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
బాలయ్య తన 108వ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనుండగా .. ఓ లుక్ అయితే వింటేజ్ బాలయ్యని తలపించేలా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ తో అంచనాలు ఒక్కసారిగా భారీ లెవెల్లోకి పెరిగాయి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో సినిమాలు, టాక్ షో, యాడ్స్.. మరోవైపు రాజకీయాలు ఇలా అన్నింటిలోనూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది అఖండ, ఈ ఏడాది వీరసింహారెడ్డి భారీ హిట్ అయ్యాయి. అన్ స్టాపబుల్ 2 షో కూడా సూపర్ సక్సెస్ అయింది. సినిమాలు, షో లు మాత్రమే కాకుండా..వరుసగా యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు NBK 108 సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
సినిమా పోస్టర్ విడుదల సందర్భంగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. అన్న దిగిండు..ఈసారి మీకు ఊహకు మించి అంటూ..ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య పోస్టర్లను షేర్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు ముచ్చటగా మూడోసారి తమన్ బాణీలు కూర్చబోతున్నాడు. కామెడీ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న అనిల్ బాలయ్యను ఎలా చూపించబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు.బాలయ్య కి ఎప్పటిలాగే సక్సెస్ లను అందుకోవాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకి విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.