తాటి కల్లు నుంచి ఐస్‌క్రీమ్స్.. ఇవి యమా టేస్ట్ గురూ..!

తాటి కల్లు నుంచి ఐస్‌క్రీమ్స్.. ఇవి యమా టేస్ట్ గురూ..!

  • News
  • April 29, 2023
  • No Comment
  • 31

మనలో ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎవరి అభిరుచికి తగ్గట్టు.. వాళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో దొరికే ఐస్‌క్రీమ్స్ తింటూ ఉంటారు. అయితే..ఇప్పటి వరకు ఎన్నో రకాల ఐస్ క్రీమ్స్‌ తిన్నప్పటికీ.. ఇంత వరకూ రుచి చూడని ఐస్‌క్రీమ్ ఇప్పుడు దేశీయ మార్కెట్లలోకి వస్తోంది. అదే… నీరా ఐస్ క్రీమ్..! తాటిచెట్టు నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరా నుంచి తయారు చేస్తున్నారు కాబట్టే.. దీనికి నీరా ఐస్ క్రీమ్ అని పేరు వచ్చింది. అదేంటి.. తాటి చెట్టు నుంచి నీరా ఐస్ క్రీమ్ ఎలా చేస్తారు..? ఎక్కడ చేస్తున్నారు..? అని ఆశ్చర్యపోతున్నారా..?

అందరికీ కాకపోయినా.. మనలో చాలా మందికి నీరా పానీయం అంటే తెలిసే ఉంటుంది. తాటి,ఈతచెట్ల నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పానీయమే నీరా. తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే ద్రవపదార్ధం కల్లుగా మారక ముందు లభించే పానీయమే నీరా. ఆల్కాహాలు లేని సహజ సిద్ధమైన పానీయంగా దీనిని అభివర్ణిస్తారు. తాటి లేదా ఈత చెట్టు నుంచి తీసిన.. నీరా పానీయం రుచితోపాటు, ఆరోగ్యాన్ని పంచుతుంది. వ్యాధులను నివారించే ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ఎన్నో విధాల ఆరోగ్యానికి మేలు చేసే నీరా పానీయాన్ని దేశంలోనే అనేక చోట్ల విరివిగా విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల అవుట్ లెట్లు పెట్టి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. వైవిధ్యమైన రుచితో.. సంప్రదాయ పానీయం కావటంతో.. నీరా అమ్మకాలు గీత కార్మికులకు సైతం లాభదాయకంగా ఉంటున్నాయి.

అయితే.. ఇలా.. తాటి, ఈత చెట్ల నుంచి లభించే “నీరా”ను ఇప్పటి వరకు పానీయంగా మాత్రమే తీసుకునే వారు. కానీ.. బీహార్‌లోని గయ ప్రాంతానికి చెందిన కొంత మంది మహిళలు సంప్రదాయ సిద్ధమైన “నీరా”తో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు. చాకోబార్ ఆకారంలో మధ్యలో ఓ పుల్ల పెట్టి.. ఆకర్షణీయమైన ఫ్లేవర్లలో వాటిని అందిస్తున్నారు.

నీరా ఐస్‌క్రీమ్స్ తయారీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గయప్రాంతంలో ఎక్కువగా తాటి చెట్లు ఉంటాయి. దీంతో స్థానికులు ఆ తాటి చెట్ల నుంచి నీరా పానీయాన్ని తీస్తున్నారు. నీరాలో పాలు.. ఫ్లేవర్స్ కలిపి.. మంచి టేస్టీగా ఉండే చాకోబార్ ఐస్‌క్రీమ్స్‌ను స్థానిక మహిళలు తయారు చేస్తున్నారు. వాటిని సమీప గ్రామాల్లో మార్కెట్ చేస్తున్నారు. సహజ సిద్ధమైన పద్దతుల్లో తయారౌతున్న ఈ “నీరా” ఐస్ క్రీమ్స్ డిఫరెంట్‌ టేస్ట్‌తో.. ఐస్ క్రీమ్ ప్రియుల నోరూరిస్తున్నాయి.

ప్రస్తుతం గయలో మొదలైన నీరా చాకోబార్ ఐస్ క్రీమ్స్ వ్యాపారం.. చుట్టు ప్రక్కల గ్రామాలకు సైతం విస్తరిస్తోంది. తక్కువ పెట్టుబడి.. సహజ సిద్ధమైన ముడి పదార్దాలతో తయారు అవుతుండటంతో.. ప్రజలు కూడా వీటిని ఇష్టంగా తింటున్నారు. పైగా ఆరోగ్యానికి నీరా పానీయం చాలా మంచిదని నిపుణులు సైతం చెబుతుండటంతో.. రోజు రోజుకూ నీరా ఐస్ క్రీమ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది.

నోరూరించే నీరా ఐస్ క్రీమ్స్‌ను మీరూ తినాలని అనుకుంటున్నారా..? అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం బీహార్‌కు మాత్రమే పరిమితం అయిన ఈ ఐస్ క్రీమ్స్ తయారీని.. మన గీత కార్మిక సోదరులు కూడా మొదలు పెట్టాలని కోరుకుందాం మరి.. !

 

Related post

ఫొటోస్ : శ్రీముఖి స్పైసీ ఫొటోస్

ఫొటోస్ : శ్రీముఖి స్పైసీ ఫొటోస్

ఫొటోస్ : శ్రీముఖి స్పైసీ ఫొటోస్
తెలంగాణ బీజేపీ నేతల పాదయాత్ర

తెలంగాణ బీజేపీ నేతల పాదయాత్ర

తెలంగాణలో తిరిగి గ్రాఫ్ ను పెంచుకునేందుకు బీజేపీ పాదయాత్రలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి పాదయాత్ర చేయాలని కమలనాథులు నిర్ణయించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి , ఎమ్మెల్యే…
ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్?!

ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశావా జగన్?!

ఇది మద్రాసు-కలకత్తా రహదారి నుంచి కావలి నియోజకవర్గం ఎస్ వి పాలెం మీదుగా జువ్వలదిన్నె వెళ్లే రహదారిలో చిప్పలేరు వాగుపై నిర్మించిన వంతెన. గత టిడిపి ప్రభుత్వం హయాంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *