కష్టం మాది… రంగులు మీవా? సగంచెరువు బ్రిడ్జి పై నిమ్మల రామానాయుడు ఫైర్‌

కష్టం మాది… రంగులు మీవా? సగంచెరువు బ్రిడ్జి పై నిమ్మల రామానాయుడు ఫైర్‌

అందరి చిరకాల కోరిక సగంచెరువు బ్రిడ్జి అని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. సగంచెరువు కు దగ్గరలోనే అయ్యప్ప స్వామి గుడి వద్ద నిర్మాణం చేసిన బ్రిడ్జి 20 సంవత్సరాలు పట్టిందని , పిరికి మట్టి /లూజ్‌ సాయిల్‌ అని, హైవేను ఎత్తు చేయడం సాధ్యం కాదన్నారన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నిర్మాణం సాద్యం కాదని ఉన్నతాధికారులు అడ్డంగా సగంచెరువు బ్రిడ్జ్‌ను వ్యతిరేకించారన్నారు.

ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మా సొంత గ్రామమని రిక్వెస్ట్‌ చేసి, మా గ్రామానికి పూలపల్లి నుండి అగర్తిపాలెం వరకు 10 కోట్లు రహదారికి, సగం చెర్వు బ్రిడ్జి నిర్మాణానికి 10 కోట్లు కలిపి మొత్తం 20 కోట్ల నిధులు మంజూరు చేయించుకొన్న 2సార్లు ఫైనాన్సు డిపార్ట్మెంట్‌ త్రిప్పి పంపిందన్నారు. ఈ డిజైన్‌లో నిర్మాణం కుదరదని, క్రిందికి నీటి ప్రవాహానికి అడ్డంకులు కలుగుతాయని ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, హైవే వారు ఇబ్బంది పెట్టినా, అన్ని ఇబ్బందులను అధిగమించి, కాంట్రాక్టు పనులకు కూడా ముందుకు ఎవరు రాకపోతే, కాంట్రాక్టర్‌ను రిక్వెస్ట్‌ చేశామన్నారు.

ఆ రోజు నిధులు ఇచ్చి సహకరించిన ఫైనాన్స్‌ మినిస్టర్‌ యనమల రామకృష్ణుడుతో శంకుస్థాపన చేసి, దగ్గరుండి పనులను పర్యవేక్షించి బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే వైఎస్‌ఆర్సిపి పార్టీ రంగులు, జండాలు కట్టుకొని మాకు సంబంధం లేకుండా ప్రారంభించుకోవడం ఎంత సబబు అని ఆయన డిమాండ్‌ చేశారు. అందుకే అడుగుతున్నాం ఈ 4 సంవత్సరాలలో నర్సాపూర్‌ కెనాల్‌ మీద చాలా గ్రామాల్లో బ్రిడ్జిల కోసం డిమాండ్‌ ఉంది. కనీసం అత్యవసరమైన లారీ స్టాండ్‌ దగ్గరైనా మీరు ఒక బ్రిడ్జి అయినా శాంక్షన్‌ చెయ్య గలిగారా ? మీరు బ్రిడ్జి తెచ్చుకుని నిర్మాణం చేసి అప్పుడు మీ రంగులు, మీ జెండాలు, మీ డప్పులతో ప్రారంభించుకుంటే అభ్యంతరం ఉండదన్నారు. రోడ్డు గుంతలు పూడ్చలేని వారు బ్రిడ్జీల నిర్మాణం చేస్తారంటే నమ్మేవాళ్ళు కూడా లేరన్నారు. కానీ మా గ్రామం, మా కష్టార్జితంపై కూడా మీరు దాడి చేస్తానంటే సహించమని హెచ్చరించారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *