పోలవరం అంతా రివర్సే..

పోలవరం అంతా రివర్సే..

పోలవరం .. ప్రాజెక్టు పూర్తి.. ఆంధ్రుల కల. 2004లో పోలవరం ప్రారంభమైనా.. ప్రాజెక్టు పూర్తికి టీడీపీ అధినేత చంద్రబాబు కంకణం కట్టుకుని .. 2014 నుంచి 2019 వరకు పనులను పరుగులు పెట్టించారు. ప్రతి సోమవారం.. పోలవరంపై.. సమీక్షలు చేసి.. ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. చంద్రబాబు ఒక బాధ్యతగా తీసుకుని.. పోలవరం పూర్తికి నిరంతరం శ్రమించారు. పోలవరం ప్రాజెక్టు వస్తే అందరి బతుకులు బాగు పడతాయని.. ఆశించిన అక్కడి ప్రజలు.. తరతరాలుగా వస్తున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చేశారు. 2006కు ముందు సేకరించిన భూములకు ఎకరాకు లక్షా 15 వేల రూపాయలు ఉండగా.. ఆ పరిహారాన్ని.. 6.36 లక్షల రూపాయలకు పెంచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే .. నిర్వాసిత కుటుంబాలకు 10 లక్షలకు ఇస్తామని.. జగన్ రెడ్డి హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదు.

2019లో జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. పోలవరంపై రివర్స్ టెండరింగ్ విధానం తెచ్చి.. మేఘా ఇంజనీరింగ్ కు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద మొత్తం 8 మండలాల్లోని 222 పంచాయతీల్లో 373 గ్రామాలు పూర్తిగా నీట మునుగుతాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గ్రామాల్లో 1,06,006 కుటుంబాలు నిర్వాసితమయ్యాయని తేల్చారు.373 గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీలు నిర్మించి అక్కడికి తరలించాల్సి ఉండగా 2022 జులై నాటికి కేవలం 27 గ్రామాలను మాత్రమే తరలించారు.ఇప్పటివరకు 8,927 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించినట్టు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పునరావాస కేంద్రాలకు తరలించబడిన వారికి ఉపాధి లేక నానా అవస్థలు పడటం అత్యంత బాధాకరం.

2022లో వరదలు వస్తే.. నిర్వాసితులంతా నెలల తరబడి పునరావాస కేంద్రాల్లో బతుకులు వెళ్లదీశారు.. అంటే .. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. అర్థమవుతుంది. నిర్వాసితుల కోసం జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని నిర్వాసిత కాలనీల్లో నిర్మిస్తోన్న ఇళ్లు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 107 గ్రామాలు ఉండగా, వాటిలో దాదాపు వంద గ్రామాల వరకూ వరద ముంపులో చిక్కుకుపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్ల పైకప్పుల పైనుంచి వరద నీరు పారింది. నిర్వాసితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లోని సామాన్లు మొత్తం పాడైపోయాయి. ప్రభుత్వం లెక్కలు కట్టిన 41.15 కాంటూరు, 45.72 కాంటూరుతో సంబంధం లేకుండా గ్రామాలన్నీ వరదల్లో చిక్కుకుని విలవిలలాడాయి. దాదాపు 25 వేల కుటుంబాలు నెలల తరబడి పునరావాస కాలనీల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వైసీపీ సర్కార్ వచ్చాక.. పోలవరం నిర్వాసితులకు బడ్జెట్ లో దాదాపుగా రూ.38 వేల కోట్లు కేటాయించి.. నిర్వాసితులకు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇప్పటికీ.. 73 శాతం పోలవరం నిర్వాసితులకు.. పరిహారం అందలేదు. వరదల్లో ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలకు రూ.పది వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. బాధితుల్లో సగం మందికి కూడా పరిహారం అందలేదు. 41.15 కాంటూరు పరిధిలో కుటుంబాలకే పరిహారం ఇవ్వకపోతే 45.75 కాంటూరు పరిధిలో ఉన్న 84 గ్రామాల్లోని 14,703 కుటుంబాలకు పరిహారం ఎప్పటికిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కేంద్రం మెడలు వంచి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడంలో .. జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా పోలవరం నిర్మాణాన్ని .. 2025 కల్లా పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం వర్షాకాలం దగ్గర పడుతోంది.. వరదలు వస్తే .. మా పరిస్థితి ఏంటని.. నిర్వాసితులు ప్రశ్నించినా.. పట్టించుకునే నాథుడే లేడు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *