దళితులకు ఏ పథకం లేకుండా చేయటమే జగన్ రెడ్డి లక్ష్యం..!

దళితులకు ఏ పథకం లేకుండా చేయటమే జగన్ రెడ్డి లక్ష్యం..!

తమది సంక్షేమ సర్కార్ అని చెప్పుకుంటోన్న జగన్ రెడ్డి, దళితులను ఏ కోశాన పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓ వైపు దళితులపై ప్రేమ వలకబోస్తూ, మరోవైపు వారి నిధులు కాజేసిన తీరు విస్తుగొలుపుతోంది. గతంలో దళిత యువకులు జీవితంలో సెటిల్ అయ్యేలా ఎస్సీ కార్పొరేషన్ వేల కోట్ల రుణాలు అందించింది. కానీ, జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆపేశారు. దళితులకు దక్కాల్సిన నిధులను నవరత్నాలకు మళ్లించారు.ఎస్సీ కార్పొరేషన్ నిధులను కట్ చేసి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేశారు.

జగన్ పాలనలో దళితులు అడుగడుగునా దగా పడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే గాకుండా, దళితులకు అందాల్సిన 23 సంక్షేమ పథకాలను రద్దు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేయాల్సిన నిధులను కూడా నవరత్నాలకు మళ్లించి ఆ సామాజికవర్గాన్ని వంచించారు. టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2.66 లక్షల మంది దళితులకు 3వేల 800 కోట్ల లబ్ధి చేశారు. ఎస్సీలకు బ్యాంకు రుణాలు, రాయితీలు అందించి వేలాది కార్లు ఇప్పించారు. దాదాపు 7 వేల 500 మందికి ఆటోలు కొనిచ్చింది. దీంతో వేలాది మంది ఎస్సీ యువతకు ఉపాది లభించింది. జగన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు పాతరేశారు. నాలుగేళ్లుగా ఎస్సీలకు ప్రత్యేకించి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఎస్సీల అభివృద్ధికి ఎంతో కీలకమైన భూమి కొనుగోలు, స్వయం ఉపాధి, విదేశీ విద్య, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం వంటి పథకాలను నిలిపివేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి… మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. కానీ వారికి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. దీంతో ఆ కార్పొరేషన్లు దిష్టి బొమ్మల్లా తయారయ్యాయి.

ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితులను ఆదుకునేందుకు టీడీపీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా దళిత యువతకు స్వయం ఉపాది కల్పించడం, వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఉచితంగా అందించడం, నాణ్యమైన విద్య, భూమిలేని నిరుపేదలకు భూమి కొనుగోలు చేసి ఇచ్చే పథకాలు ఎన్నో అమలు చేశారు. దళితుల్లో మెరిట్ స్టూడెంట్స్ విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కో దళిత విద్యార్థికి 15 లక్షల సాయం అందించారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కరికి కూడా విదేశీ విద్యకు సాయం చేయలేదు. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి గతంలో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు అందించారు. ఇక చదువుకున్న దళిత యువతీ, యువకులు పోటీ పరీక్షలకు సిద్దం అయ్యేందుకు అయ్యే ఖర్చును విద్యోన్నతి పథకం ద్వారా టీడీపీ ఒక్కొక్కరికి లక్షా 20వేలు అందించింది. దాంతో, ఎంతో మంది యువకులు సివిల్స్ సాధించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో దళిత రైతులకు సున్నా వడ్డీ పథకం ద్వారా ఏటా 24వేలు ఇచ్చారు. చంద్రన్నబీమా కింద ఎస్సీలకు 5 లక్షలు, భూమి కొనుగోలుకు మరో ఐదు లక్షలు సహాయం చేశారు. కానీ, జగన్‌ సర్కారు అవన్నీ విస్మరించింది. దళితుల పథకాలన్నీ అటకెక్కించింది. ఏదో మొక్కుబడిగా కొంత సొత్తు జమవేసి దళితుల సంక్షేమంలో మాకు మించిన వారు లేరని డప్పు కొట్టుకుంటున్నారు.

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఎస్సీలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రతి సభలో సీఎం జగన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. బటన్ నొక్కి 2 లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో వేశామని, అందులో ఎస్సీలకు 34 వేల కోట్లు అందాయని జగన్ రెడ్డి చెబుతున్నా అందులో వాస్తవం లేదు. దళితులకు ప్రత్యేకంగా చేకూరిన లబ్ది ఏమీ లేదు. ఏపీలో దళితుల జనాభా 17 శాతంగా ఉంది. వారి జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో సంక్షేమానికి నిధులు కేటాయించి వారికే ఖర్చు చేయాలని చట్టం చెబుతోంది. అయితే బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లిస్తోంది. టీడీపీ ప్రభుత్వ పాలనలో దళిత యువకులకు ఇచ్చే అన్ని రుణాలపై లక్ష రూపాయలు రాయితీ అందించారు. ప్రస్తుతం అలాంటి పథకం ఒక్కటి కూడా అమలు కావడం లేదు. 2014 నుంచి 19 ఏప్రిల్ వరకు పారిశ్రామికంగా ఎదగాలనుకునే దళిత యువతకు 75 లక్షల రాయితీ అందించారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక అన్నింటినీ నవరత్నాల్లో కలిపేశారు.

రాష్ట్ర విభజన తరవాత ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నా దళితుల సంక్షేమం విషయంలో చంద్రబాబునాయుడు వెనకడుగు వేయలేదు.కానీ, జగన్ ఆ సామాజిక వర్గానికి చెందిన 23 పథకాలకు మంగళం పాడి, నవరత్నాల పేరుతో చేస్తున్న మోసాన్ని దళితులు ఎండగడుతున్నారు. నీవే మా నమ్మకం జగన్ అంటూ గడప గడపకు వెళుతోన్న వైసీపీ నాయకులకు దళిత యువత చుక్కలు చూపిస్తోంది. ఎన్నికల్లో ఏం చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటూ నిలదీస్తుండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెల్లమొహం వేస్తున్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *