
‘జగన్ కు సెంటిమెంట్స్ లేవు’ : అచ్చన్నాయుడు
- Ap political StoryNewsPolitics
- April 19, 2023
- No Comment
- 30
మంగళవారం కడప నగరంలోని పుత్తా ఎస్టేట్స్‌లో టీడీపీ జోన్ 5 సమీక్షా సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు మాట్లాడుతూ.. సొంత బాబాయ్‌ని చంపి జగన్ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఆయన బాబాయ్ వివేకాను చంద్రబాబు నాయుడు చంపాడని సానుభూతి కోసం మాట్లాడారని అన్నారు. వివేకాకు కుట్లు వేసి కవర్ చేయాలని అనుకున్నాడని అన్నారు.
జగన్‌కు చెల్లి, తల్లి అనే సెంటిమెంట్స్ లేవని, వివేకానంద రెడ్డి గురించి ఓ పత్రికలో రాసిన రాతలు చూస్తే అసహ్యం వేస్తోందన్నారు. పులివెందులలో శాసనమండలి ఎన్నికల్లో మొగుణ్ణి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం జగన్‌కు ప్రజల తిరుగుబాటు మొదలైందని, రాయలసీమ బిడ్డ అయి ఉండి కడపకు ఉక్కు పరిశ్రమ లేదు.. విశాఖ ఉక్కు వెళ్లిపోయేలా చేసారని జగన్‌పై విరుచుకుపడ్డారు.
అదనపు భద్రత కల్పించాలి
కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో జరిగే చంద్రబాబు పర్యటనకు అదనపు భద్రత కల్పించాలి టిడిపి రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు డిజిపికి లేఖ రాశారు. 18న కడప, 19న ప్రకాశం జిల్లా గిద్దలూరు, 20న మార్కాపురం, 21న ఎర్రగొండుపాలెం లో చంద్రబాబు పర్యట ఉందన్నారు. చంద్రబాబు సమావేశాల పై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు కుట్రకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో అదనపు భద్రత కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.