నందమూరి తారక రామారావును వరించబోతున్న భారతరత్న అవార్డు

నందమూరి తారక రామారావును వరించబోతున్న భారతరత్న అవార్డు

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న స్వర్గీయ నందమూరి తారక రామారావును వరించబోతోంది. భారత రత్న అవార్డును ప్రకటించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. గణతంత్ర దినోత్సవానికి ముందుగా ఈ అవార్డు ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. తెలుగు నాట నందమూరి తారక రామారావుది ప్రత్యేకత. కళారంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఆయన ఓ సంచలనం. తెలుగోడి ఆత్మగౌరవాని ఎన్టీఆర్ ఓ ప్రతీకగా నిలిచారు. ప్రజాక్షేత్రంలో ఎన్టీరామారావు సినీ నటుడిగా కోట్లాది మందికి అభిమాన కధా నాయకుడయ్యారు. రాజకీయాల్లోనూ రెట్టింపు స్థాయిలో ప్రజల హృదయాలకు చేరువయ్యారు. పాలనా సంస్కరణలతో తనదైన ముద్రవేశారు. ప్రజలకు ప్రభుత్వ పాలనను పారదర్శకంగా మరింత చేరువ చేసే ప్రయత్నం చేశారు. ప్రజల వద్దకు పాలన, రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, పేదలకు జనతావస్త్రాల పంపిణీ, వృద్ధులకు, వితంతువులకు సామాజిక భద్రతకోసం పెన్షన్ విధానం, రైతులకు ఉచిత విద్యుత్తు సదుపాయం, సబ్సిడీతో విత్తనాలు, ఎరువుల పంపిణీ, పేదలకు పక్కాఇళ్ల నిర్మాణం వంటి పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు.

సామాజిక సాయంలోనూ ఎన్టీఆర్ ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధిత ప్రజలకు అండగా నిలిచేందుకు జోలెపట్టి విరాళాలను సేకరించారు. ఎన్నికల ప్రచారాన్ని విభిన్నంగా తీర్చి దిద్దారు. ప్రజల్లోకి ఆయన సాదా సీదాగా వెళ్లారు. ప్రచారం రథంతో వెళ్లిన ఎన్టీరామారావు రోడ్లపక్కనే స్నానపానాదులతో సామాన్యుల గుండెలకు మరింత చేరువయ్యారు. సినిమా కథా నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రభావశీలుడిగా రాణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించి ప్రజాకర్షక నాయకుడయ్యారు.

ఎన్టీరామారావు మరణానంతరం భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ తరచూ విన్పిస్తున్నప్పటికీ… అటల్ బిహారి వాజపేయి ప్రధానిగా ఉన్నపుడు భారత రత్న అవార్డు ప్రకటిస్తారనే వార్తలు విన్పించినా… ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో ఎన్టీరామారావు పేరును ప్రస్తావనకు తెచ్చారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన భారతీయ జనతాపార్టీ కార్యనిర్వాహక సమావేశాల్లోనూ ఎన్టీరామారావుపేరు ప్రస్తావించారు. ఎన్టీరామారావు భౌతికంగా దూరమై 27 యేళ్లు గడుస్తున్నప్పటికీ… ఆయన పాలనతీరు, వ్యవహారశైలి, సంస్కరణలతో ప్రజలగుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షా హైదరాబాద్ వచ్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారత రత్న అవార్డు ఎన్టీరామారావు పేరు పరిశీలన తుది దశకు చేరుకుంది. ప్రతియేటా వివిధ రంగాల్లో సేవలు అందించే వారికి రిపబ్లిక్ డే సందర్భంగా పద్మభూషణ్, పద్మవిభూషన్, పద్మశ్రీ అవార్డులతో పాటు భారత రత్న అవార్డులను ప్రకటించే కేంద్ర ప్రభుత్వం ఎన్టీరామారావు పేరును ప్రతిపాదనలోకి తీసుకుందని సమాచారం. సామాజిక, రాజకీయ, కళా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఎన్టీరామారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డుకు ఎంపిక చేసిన విషయాన్ని అధికారికంగా ప్రకటన చేయనుందని విశ్వసనీయ సమాచారం.

Related post

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరులో నారాయణ పూజలు

నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్‌చార్జ్‌ ,మాజీమంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రమాదేవి కలిసి పలు చోట్ల.. వినాయక స్వామివారిని…
పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

పార్టీ బాధ్యతలను భుజాలపై వేసుకున్న లోకేష్

టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ, వాటన్నంటినీ ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా ముందుండి నడిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కానీ, ఇప్పుడు ఆయనకే కష్టం వచ్చింది. అక్రమ అరెస్ట్…
చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం..  విడుదల అయ్యేంత వరకు పోరాటం

చంద్ర‌బాబుకు అండ‌గా నిలుద్దాం.. విడుదల అయ్యేంత వరకు పోరాటం

నాలుగున్నర దశాబ్దాల పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవినీతికి తావు లేకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం.. నిరంతరం అభివద్ధే ధ్యేయంగా పని చేసిన చంద్రబాబుపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *