
ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ షురూ..
- EntertainmentMoviesNews
- March 23, 2023
- No Comment
- 51
ఎంతోకాలంగా ఎన్టీఆర్ అభిమానులు.. వేచి చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. ఎన్టీఆర్ 30వ కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి పలువురు.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, జాన్వీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ జాన్వీని ప్రేమగా పలుకరిస్తూ చేతిలో చేయి వేసి అప్యాయంగా మాట్లాడారు.
దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం.. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎన్టీఆర్-జాన్వీకపూర్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు జక్కన్న క్లాప్ కొట్టారు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దీంతో దర్శకుడు కొరటాల, ఎన్టీఆర్ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ హైప్ స్టార్ట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ ఆడియెన్స్ అటెన్షన్ ని కూడా తారక్ అందుకోగా.. అక్కడ నుంచి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో .. ఎన్టీఆర్ 30 ఒకటిగా నిలువబోతోంది.
ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమాల్లో గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్రబృందంతో ఆమె కలివిడిగా కనిపించారు. అందరితో.. కాసేపు సరదాగా మాట్లాడారు. అలాగే రాజమౌళితోనూ .. జాన్వీ ముచ్చటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత కల్యాణ్ రామ్ తదితరులు సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 30 స్ట్రోమ్ బిగిన్స్ వంటి హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
తాజా సినిమాపై దర్శకుడు కొరటాల.. మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడిన మాటలు తారక్ ఫ్యాన్స్ కి మరింత నమ్మకాన్ని కలిగించాయి. ఎన్టీఆర్ సినిమా లైన్ కోసం ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ ఇస్తూ ఓ రేంజ్ లో ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఉంటుందని కొరటాల తెలిపారు. ఇది పక్కా కమర్షియల్ మాస్ చిత్రమని చెప్పకనే చెప్పారు. తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ గా నిలుస్తుందని .. అలాగే సినిమాకి బెస్ట్ టీం తో వర్క్ చేస్తున్నానని కొరటాల తెలిపారు. ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ పూజాకార్యక్రమాలు మొదలు కావడంతో.. అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు.. దర్శకుడు కొరటాల ఇచ్చిన భరోసాతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ.కె, సుధాకర్ మిక్కినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా NTR 30 తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. స్టార్ట్ నటీనటులనే కాదు.. స్టార్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా టీమ్‌లో ఉన్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు శిరిల్ పార్ట్ అయ్యారు. మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న NTR 30 రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.